వరదలో చిక్కుకున్న లారీలు…తాహసిల్దార్ పై లారీ డ్రైవర్ల ఆగ్రహం

0 10

విజయవాడ  ముచ్చట్లు :
కృష్ణా జిల్లా కంచికచర్ల చెవిటికల్లు ఇసుక రీచ్లో భారీ సంఖ్యలో  లారీలు చిక్కుకుపోయాయి. ఒక్కసారిగా కృష్ణా నదిలో వరద ఉధృతి పెరగింది. మరోవైపు రహదారి సైతం కొంత మేర దెబ్బతిన్నది. దీంతో లారీలు కదిలే పరిస్థితి లేక ఎక్కడివక్కడే ఆగిపోయాయి. వరదలో చిక్కుకున్న లారీ డైవర్లు,  క్లీనర్లు, కూలీలను పడవల ద్వారా బయటకు తీసుకువచ్చారు.. వరదలో చిక్కుకుపోయిన లారీలను వరద ప్రవాహం తగ్గిన తరువాత బయటకు తీసుకు వస్తామని అధికారులు చెబుతున్నారు. విషయం తెలిసిన లారీ యజమానులు అక్కడి చేరుకున్నారు. తాహసిల్ధార్   పై ఆగ్రహం వ్యక్తం చేసారు. సంఘటనా స్థలానికి ఆలస్యంగా వచ్చిన ఎమ్మార్వో పై లారీ డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద విషయం ముందస్తు సమాచారం ఇవ్వలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేసారు. లక్షల రూపాయలు వెచ్చించి కొన్న లారీలు వరద నీటిలో మునిగి పోతున్నాయని ఎమ్మార్వో ముందు గోడు వెళ్లబోసుకున్నారు. వరద విషయం ముందుగా ఎందుకు చెప్పలేదని ఎమ్మార్వో ని నిలదీసారు.  ఆమె మాత్రం తన వద్ద పూర్తి సమాచారం లేదని అంత పెద్ద వరద ఏమీ కాదని పొంతనలేని సమాధానం చెప్పడ్ం విశేషం.

 

 

Tags:Lorry drivers caught in flood. Lorry drivers angry over Tahasildar

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page