మానవత్వం చాటుకున్న మన్యప్రగతి చారిటబుల్ ట్రస్ట్

0 15

విశాఖపట్నం  ముచ్చట్లు :
అరకులోయ మండలం ,మండలంలోని పద్మాపురం పంచాయితీ సిరలమామిడి వలస సమీపంలో శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. అనాధగా పడి ఉన్న మృత దేహాన్ని గుర్తించిన స్థానికులు విషయాన్ని పంచాయితీలోని మన్యప్రగతి చారిటబుల్ ట్రస్ట్ వారియర్స్ కి తెలియజేశారు.ట్రస్ట్ వ్యవస్థాపకులు, అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణకు తెలియ జేయడంతో తక్షణమే స్పందించిన ఆయన మృతదేహాన్ని ఖననం జరిపేందుకు “ఆఖరి ప్రయాణ రథాన్ని” ఘటనా స్థలానికి పంపగా, స్థానిక వైసీపీ సీనియర్ నాయకులు, పెట్టేలి శుక్ర, వార్డు మెంబర్ యాసిన్ మరియు తదితర సభ్యులు కలిసి మృతదేహాన్ని “మన్యప్రగతి చారిటబుల్ ట్రస్ట్” అంబులెన్సు ద్వారా సమీప స్మశానవాటికకు తరలించి అనంతరం అంత్యక్రియలు జరిపారు. మానవత్వమే ప్రధాన లక్ష్యంగా సేవలందిస్తున్న “మన్యప్రగతి చారిటబుల్ ట్రస్ట్” సేవలకు , ట్రస్ట్ వ్యవస్థాపకులు అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ గారికి పలువురు అభినందనలు..

 

 

Tags:Manyapragati Charitable Trust for Humanity

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page