గుడివాడలో టీడీపికి మరిన్ని కష్టాలు

0 45

విజయవాడ  ముచ్చట్లు :

టీడీపీ వ్యవ‌స్థాప‌క అధ్యక్షుడు ఎన్టీఆర్ జ‌న్మించిన కృష్ణాజిల్లాలో టీడీపీ ప‌రిస్థితి నాలుగు అడుగులు ముందుకు ప‌దడుగులు వెనక్కి అన్న చందంగా మారిపోయింది. 2014లో ఒకింత ప‌రిస్థితి బాగుంద‌ని అనుకున్నా.. గ‌త ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే మాత్రం పార్టీ పూర్తిగా డీలా ప‌డిపోయింది. మ‌రీ ముఖ్యంగా గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ఇప్పట్లో కోలుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు. వాస్తవానికి జిల్లా మొత్తంలో.. టీడీపీ గెల‌వాల్సిన‌.. గెలిచి తీరాల్సిన నియోజ‌క‌వ‌ర్గం.. గుడివాడేన‌ని .. పార్టీలోని ప్రతి నాయ‌కుడు.. చెబుతారు.దీనికి ప్రధాన కార‌ణం.. టీడీపీలో రాజ‌కీయ ఓన‌మాలు నేర్చుకుని.. ఎదిగిన ప్రస్తుత మంత్రి కొడాలి నాని ఇక్కడ నుంచి వ‌రుస విజ‌యాలు సాధిస్తున్నారు. అయితే.. ఆయ‌న టీడీపీని విడిచి పెట్టిన త‌ర్వాత‌.. పార్టీ అధినేత చంద్రబాబుపైనా.. లోకేష్‌పైనా .. ఏ విధంగా విరుచుకుప‌డుతున్నారో.. అంద‌రికీ తెలిసిందే. దీనిపై టీడీపీలోనూ నేత‌లు ఉడికిపోతూ ఉంటారు. అయితే.. చేయాల్సింది మాత్రం చేయ‌డం లేద‌నే విమ‌ర్శలు వ‌స్తున్నాయి. అంటే.. కొడాలిని ఢీకొట్టి ఆయ‌న‌ను ఓడించే నాయ‌కుడిని మాత్రం టీడీపీ సిద్ధం చేసుకోలేక పోతోంద‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం అంటే ఒక‌ప్పుడు ఎన్టీఆర్‌.. గెలుపొందిన నియోజ‌క‌వ‌ర్గంగా టీడీపీ నేత‌లు ఎంతో ఇష్టప‌డ‌తారు. ఈక్రమంలో కొడాలి నాని ఇక్కడ నుంచి టీడీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్నారు. ఆయ‌న వైసీపీలో చేరిన త‌ర్వాత కూడా వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకుంటున్నా రు. ఆయ‌న గెల‌వ‌డంపై ఎవ‌రికీ అభ్యంత‌రం లేదు. కానీ, ఎడాపెడా నోరు పారేసుకోవ‌డంపై మాత్రం టీడీపీ నేత‌లు ఉడికిపోతున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. ఈ నియోజ‌క‌వ‌ర్గంపై కొంత మేర‌కు క‌స‌ర‌త్తు జ‌రిగింది.ఈ క్రమంలోనే విజ‌య‌వాడ‌కు చెందిన యువ నాయ‌కుడు దేవినేని అవినాష్‌కు ఇక్కడ 2019లో టికెట్ ఇచ్చారు. అయితే.. ఆయన ఆ ఎన్నిక‌ల్లో ఓడిపోయి.. వైసీపీలో చేరిపోయారు. ఇక‌, ఇప్పుడు ఇక్కడ టీడీపీ ని న‌డిపించే నాయ‌కులు క‌నిపించ‌డం లేదు. పేరుకు మాత్రం ఇంచార్జ్ పోస్టును రావి వెంక‌టేశ్వ రావుకు ఇచ్చినా.. ఆయ‌న‌లో కొడాలి నానిని డీకొట్టేంత సీన్ లేద‌ని.. టీడీపీలోనే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. పోనీ.. నియోజ‌క‌వ‌ర్గంలో అయినా.. ఉంటున్నారా? అంటే.. అది కూడా లేదు.ఆయ‌న వ్యాపారాల్లో ఆయ‌న బిజీగా ఉంటున్నారు. పేరుకు మాత్రమే రావి మంచినేత‌గా ఉంటున్నా.. ఇప్పటి రాజ‌కీయాల్లో ఉండాల్సిన దూకుడు అయితే ఆయ‌న‌లో లేక‌పోవ‌డం మైన‌స్‌. ఈ ప‌రిణామాల‌ను స‌రిదిద్దక పోతే.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు కూడా గుడివాడ‌లో టీడీపీ పుంజుకునే ప‌రిస్థితి లేదు. మొత్తానికి కొడాలి నాని ఇలాకాలో ఆయ‌న‌పై పోటీ చేసే ద‌మ్మున్న నేతే బాబుకు దొర‌క‌నంత క‌ష్టం వ‌చ్చేసింది..

- Advertisement -

Tags:More hardships for TDP in Gudivada

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page