అరకు పార్లమెంట్ తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా నరంజి ప్రసాద్ ఎన్నిక

0 33

ఘనంగా సన్మానించిన పార్టీ కార్యకర్తలు

విశాఖపట్నం  ముచ్చట్లు :
అరకు పార్లమెంట్ తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా నరంజి ప్రసాద్ ఎన్నికయ్యారు.తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాలు మేరకు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పనిచేస్తారని నరంజి ప్రసాద్ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి గా నియమించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి అనంతరం పెదబయలు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు సీకరి సుకుమరి చేతులు మీదుగా ఘనంగా సన్మానించారు.అనంతరం నరంజి ప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నన్ను నమ్మి అప్పగించిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని పార్టీ బలోపేతనానికి అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు.నాకు ఈ పదవి రావడానికి ప్రోత్సహించిన అరకు ఇంచార్జ్ కిడారి శ్రావణ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి వెచ్చoగి కొండయ్య,కూడా భూషణ్, రాజారావు,మండలానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

 

- Advertisement -

Tags:Naranji Prasad elected Telugu Youth General Secretary of Araku Parliament

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page