నెల్లూరు సి. వై.ఎఫ్ బృందం ఆధ్వర్యంలో  వృద్ధులకు, అనాధలకు బోజనాలు పంపిణీ

0 9

నెల్లూరు ముచ్చట్లు :

స్థానిక నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్,ఏ.సి నగర్  ప్రాంతంలో ఉన్న గీతామయి అనాథాశ్రమం మరియు వృద్ధాశ్రమాల్లో ఉన్న వృద్ధులకు అనాధలకు నెల్లూరు  క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ వారు సకలరుచులతో,బోజనాలను శనివారం అందించారు.ఈ సందర్భంగా సి.వై.ఎఫ్ జిల్లా అధ్యక్షులు బ్రదర్.రాజేష్ మరియు రూరల్ ప్రెసిడెంట్ బ్రదర్ రాజు మాట్లాడుతూ క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపడమే నిజమైన క్రైస్తవ్యం అనీ అన్నారు.సి.వై.ఎఫ్ ఇప్పటికే ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాలలో వందలాదిగా,వేలాదిగా సేవాకార్యక్రమాలు నిర్వహించిందనీ తెలిపారు.అలాగే వ్యసనాలతో,మత్తుపదార్ధాలకు బానిసలుగా మారిన వేలాది యువతకు కౌన్సెలింగ్ ద్వారా,ఆధ్యాత్మికతవైపు మళ్ళిస్తున్నామని తెలిపారు. రానున్న అక్టోబర్ మాసంలో కాకినాడలో జరిగే యువజనోత్సవాలకు దేశం నలుమూలాలనుండి యువత తరలి రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో సి.వై.ఎఫ్ కమిటీ బ్రదర్ విజయ్,బ్రదర్.స్వరూప్, బ్రదర్. సాత్వీక్, బ్రదర్.సుశీల్,బ్రదర్.ఆశిష్,బ్రదర్.శ్రీకాంత్ లు పాల్గొన్నారు.

 

- Advertisement -

Tags:Nellore c. Distribution of meals to the elderly and orphans under the auspices of the YF team

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page