కమలా నెహ్రు ఆసుపత్రిలో పైసా వసూల్

0 10

నల్గొండ ముచ్చట్లు :

నాగార్జున సాగర్ కమలా నెహ్రు ప్రభుత్వాస్పత్రిలో  కొంతమంది వైద్యులు కాసులు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  డబ్బులిస్తేనే సీజేరియన్ చేస్తున్నారు. లేదంటే ప్రైవేట్ ఆస్పత్రికి రిఫర్ చేస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. బాధితులు డాక్టర్ల గుట్టు బయటపెట్టారు. ఒక్కో సీజేరియన్ కు  రూ.5 వేలు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  నాగార్జున సాగర్ ప్రభుత్వ కమల నెహ్రూ ఏరియా హాస్పిటల్ లో అన్న ,చెల్లెలు పైసా వసూల్ చేస్తున్నారని అంటున్నారు. గతంలో ఎమ్మెల్యే నోముల భగత్ తనఖీ చేసినా  ఒక డాక్టర్ పద్దతి మారలేదని అటున్నారు. తాజాగా ఒక మూగ  గర్భిణీ దగ్గర ముక్కు పిండి 5,000 వేలు రూపాయలు వసూలు చేసిన ట్లు సదరు డాక్టర్ పై రోగుల బంధువులు మండిపడుతున్నారు. గత 8 నెలల నుండి గర్భిణీ ల దగ్గర పైసలు వసూలు చేస్తూ లక్షలు  వెనుక వేసుకుంటున్న డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని వారు అంటున్నారు.  ఈ వ్యహహారాన్ని ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ భాను ప్రసాద్ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

 

- Advertisement -

Tags:Payment at Kamala Nehru Hospital

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page