పబ్లిగ్గా దోపిడి అంటూ ప్రవీణ్ షాకింగ్ కామెంట్స్

0 8

హైదరాబాద్  ముచ్చట్లు :

రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు క్రేజ్ నడుస్తోంది. అర్హులను గుర్తించి ఆగస్టు 16న నిధులు జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో లబ్ధిదారులు పోటీపడుతున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో అర్హుల ఎంపిక ప్రక్రియ రసాభాసగా మారింది. బిల్డింగులు ఉన్నోళ్లకి.. ఉద్యోగస్తుల కుటుంబాలను దళిత బంధుకి ఎంపిక చేసి అసలు కేసీఆర్‌ని కలిసి వచ్చిన వారిని వదిలేశారంటూ దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. టీఆర్‌ఎస్‌కి అనుకూలంగా ఉన్నవారినే ఎంపిక చేశారని.. అది దళిత బంధు కాదు, టీఆర్‌ఎస్ బంధు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అదే విషయమై మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. దళిత బంధు పేరెత్తకుండానే సునిశిత విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్‌పై షాకింగ్ సైటైర్లు వేశారు. వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ ప్రపంచంలోనే ఎక్కడా ఇటాంటి స్కీం లేదని చెప్పారని.. అది నిజమేనని ఆయన పరోక్ష విమర్శలు చేశారు. పథకం ప్రవేశపెట్టే ముందు ఎలాంటి విశ్లేషణ, నిబంధనలు లేకుండా.. అర్హుల ఎంపిక కూడా పారదర్శకంగా జరపకుండా దళిత బంధుని స్టార్ట్ చేశారని ఆయన విమర్శించారు. కనీసం శిక్షణ కూడా ఇవ్వకుండా 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆగస్టు 16న మనోళ్లకు పబ్లగ్గా ఇస్తారని ఆయన అన్నారు. ఇది ముమ్మటికీ ప్రపంచ రికార్డేనని.. ఇలాంటి పథకం ప్రపంచంలో ఎక్కడా లేదని ఆర్‌ఎస్ ప్రవీణ్ షాకింగ్ ట్వీట్ చేశారు.

 

- Advertisement -

TagsL:Praveen’s shocking comments that he is being exploited as a publicist

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page