కాంట్రాక్టు బానిస సంకెళ్లనుంచి పారామెడికల్ ఉద్యోగులను కాపాడండి

0 7

స్వాతంత్ర్య దినోత్సవాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వేడుకుంటూ ప్రత్యేక కార్యక్రమం
నల్లజర్ల  ముచ్చట్లు :
కాంట్రాక్టు బానిస సంకెళ్ళలో చిక్కుకుపోయిన తమను తక్షణమే క్రమబద్ధీకరించి ఆదుకోవాలని  ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ లోని కాంట్రాక్టు పారా మెడికల్ ఉద్యోగులు వేడుకున్నారు. తమ రెగ్యులర్ సాధనకోసం రాష్ట్ర వ్యాప్తంగా గత 76 రోజులుగా జరుగుతున్న కాంట్రాక్టు ఉద్యోగుల నిరవధిక నిరసన కార్యక్రమాల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులు  శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) రాష్ట్ర కన్వీనర్ జీవివి ప్రసాద్ మాట్లాడుతూ, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చే విధంగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటూ, ఎన్నో ఏళ్లుగా రెగ్యులర్ కోసం ఎదురు చూస్తున్నా కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగుల కలలను నిజం చేయాలని ఆ ఉద్యోగులు కోరుతున్నారన్నారు.

 

Tags:Protect paramedical employees from contract slave shackles

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page