రాహుల్ గాంధీ ట్విట్ట‌ర్ ఖాతా పునరుద్ధరణ..!

0 3

ఢిల్లీ ముచ్చట్లు :

ఢిల్లీలో జరిగిన తొమ్మిదేళ్ల బాలిక హత్యాచార ఘటనకు సంబంధించి ఆమె తల్లిదండ్రుల వివరాలను వెల్ల‌డించడంతో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌ ఖాతాను తాత్కాలికంగా లాక్ చేస్తూ ఆ సామాజిక మాధ్య‌మ సంస్థ నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. అలాగే, మ‌రి కొంత మంది కాంగ్రెస్ నేత‌ల ఖాతాల‌ను కూడా ట్విట్ట‌ర్ బ్లాక్ చేసింది. దీనిపై రాహుల్ గాంధీ ఇప్ప‌టికే మండిప‌డ్డారు. తాజాగా ఆయ‌న‌ ట్విటర్‌ ఖాతాను ట్విట్ట‌ర్‌ పునరుద్ధరించింది. రాహుల్‌తో పాటు మరికొందరు పార్టీ నేతల ఖాతాలను కూడా పునరుద్ధరించినట్లు తెలిపింది. ట్విట్ట‌ర్‌ ఇండియా అధిపతిగా ఉన్న మనీశ్‌ మహేశ్వరిని అమెరికాకు బదిలీ చేస్తూ ఆ సంస్థ నిన్న నిర్ణయం తీసుకోవ‌డం, ఈ రోజు కాంగ్రెస్ నేత‌ల ఖాతాల‌ను అన్‌లాక్ చేయ‌డం గ‌మ‌నార్హం.

 

- Advertisement -

Tags:Rahul Gandhi Twitter account revived ..!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page