స్పైస్ జెట్ విమాన సంస్థకు భారీ జరిమానా..!

0 8

ముంబాయి ముచ్చట్లు :

టికెట్లను రద్దు చేయించి వినియోగదారుడికి ఆర్థికనష్టం, వేదనను కలిగించినందుకు విమానయాన సంస్థ స్పైస్ జెట్ కు జిల్లా వినియోగదారుల కమిషన్ భారీ జరిమానా విధించింది. హైదరాబాద్ అంబర్ పేటకు చెందిన జంధ్యాల సూర్యనారాయణ, జంధ్యాల భారతిలు హైదరాబాద్-ఢిల్లీ-శ్రీనగర్ వెళ్లేందుకు 2018 అక్టోబర్ 31న మేక్ మై ట్రిప్ ద్వారా స్పైస్ జెట్ విమాన టికెట్లు, అక్కడి హోటల్ ను బుక్ చేసుకున్నారు. విమానం ఆలస్యంగా వస్తోందని… ఈ టికెట్లను క్యాన్సిల్ చేసుకుని, గో-ఐబిబో ద్వారా టికెట్లను బుక్ చేసుకోవాలని స్పైస్ జెట్ సిబ్బంది వారికి సూచించారు. సిబ్బంది చెప్పినట్టుగానే వారు చేశారు. మళ్లీ టిక్కెట్లు బుక్ చేయడం ద్వారా తమకు 30వేల రూపాయలు అదనంగా ఖర్చాయ్యాయని, సంస్థ నుంచి తమకు పరిహారం అందించాలని కోరారు. ఆ మేరకు కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

 

- Advertisement -

Tags:SpiceJet fined

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page