గొడవలకు పాల్బడితే కఠిన చర్యలు ,సీఐ పార్థసారథి

0 8

భక్తి శ్రద్ధలతో మొహరం వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి
ఎస్ ఐ  మన్మధ విజయ్

కౌతాళం  ముచ్చట్లు :
కౌతాళం మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించే మొహరం పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఎవరైనా గొడవలకు పాల్బడితే కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామస్తులు సమక్షంలో ఆదోని సీఐ పార్థసారథి కౌతాళం ఎస్ఐ మన్మధ విజయ్ తెలియజేశారు.శనివారం  రోజున మండల పరిధిలో ని కుంటానహల్ గ్రామంలో స్థానిక  స్థానిక ప్రజలతో మొహరం పండుగ నిర్వహణపై అవగాహన కల్పించారు. మొహరం పండుగ వేడుకలలో ఎటువంటి అల్లర్లు,గొడవలు సృష్టించకుండా భక్తి శ్రద్ధలతో మొహరం పండుగ వేడుకలను నిర్వహించుకోవాలని హాజరైన గ్రామ పెద్దలకు, ప్రజలకు తెలియజేశారు.మొహరం పండుగ సమయంలో శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.గ్రామాలలో ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని సి ఐ ఎస్సై, ప్రజలకు తెలియజేశారు. అదేవిధంగా దేవుళ్ళ ఊరేగింపు సమయంలో కోవిడ్ నిబంధనలను ప్రతి ఒక్కరు తప్పకుండా పాటించాలని తెలియజేశారు. పీర్ల చావిడి వద్ద జనాలు గుంపుగా ఉండకూడదని,మాస్కులు ధరించి భౌతిక దూరాలను పాటించాలని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో  పోలీస్ సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Tags:Strict action if involved in riots, CI Parthasarathy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page