బాధిత కుటుంబాన్ని కాపాడిన పోలీసులు కృతజ్ఞతలు

0 5

మూఢ విశ్వాసాలు ప్రజలు విడనాడాలి

భారత నాస్తిక సమాజం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పులేటి నరేష్

- Advertisement -

జగిత్యాల ముచ్చట్లు :

బాధిత కుటుంబాన్ని కాపాడిన పోలీసులకు కృతజ్ఞతలు మూఢవిశ్వాసాలు ప్రజలు విడనాడాలని భారత నాస్తిక సమాజం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పులేటి నరేష్ అన్నారు. జగిత్యాల రూరల్ పరిధిలోని తారకరామనగర్ ను భారత నాస్తిక సమాజం బృందం గ్రామాన్ని సందర్శించి జరిగిన సంఘటనపై నిజనిర్ధారణ కమిటీ వేశారు. అనంతరం భారత నాస్తిక సమాజం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పులేటి నరేష్ మాట్లాడుతూ అదే గ్రామానికి చెందిన ఓర్సు రమేష్ అనే యువకుడు అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందగా మంత్రాలు చేసే చంపారని అదే గ్రామానికి చెందిన కుటుంబీకులపైన మృతుడి కుటుంబ సభ్యులు దాడి చేశారు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి త్వరగా చేరుకోవడంతో కుటుంబ సభ్యుల ప్రాణాలు కాపాడారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మూఢనమ్మకాల సంఘటనలపై ప్రభుత్వం స్పందించాలని. పోలీస్ శాఖ మరియు ప్రజాప్రతినిధుల సహకారంతో టి ఆర్ నగర్ లో భారత నాస్తిక సమాజం ఆధ్వర్యంలో త్వరలోనే మూఢనమ్మకాలపై చైతన్య కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ ,అనిల్,  గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

 

 

Tags:Thanks to the police who rescued the victim’s family

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page