తెలుగు రాష్ట్రాల్లో తొలి కోవిడ్ క్లినికల్ ట్రయల్స్ ల్యాబ్

0 8

సింహాచలం ముచ్చట్లు :
తెలుగు రాష్ట్రాల్లో తొలి కోవిడ్ క్లినికల్ ట్రయల్స్ ల్యాబ్ ప్రారంభమయింది. సింహాచలం లో మంత్రి అవంతి, విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం వి వి సత్యనారాయణ ప్రారంభించారు.  బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ  కేంద్ర మంత్రిత్వ శాఖ సహకారంతో విశాఖ లో ఈ ల్యాబ్ ను ఏర్పాటు చేశామన్నారు. రంగులు,లక్షణాలను, తీవ్రత స్థాయిని ఎప్పటికప్పుడు  మరుస్తూన్న కరోనా వైరస్ పై ప్రత్యేకించి టీకా తయారీ ఫార్మా సంస్థలకు  ఇది వేదిక కానుంది. కరోనా వైరస్ తో పాటు అన్ని రకాల వ్యాధుల, వైరస్ల పై ఇక్కడ క్లినికల్ ట్రయిల్స్ జరగనున్నాయి.  దేశంలోని 19 ప్రాంతాల్లో విశాఖ పట్నం కేంద్రం  మరో మైలు రాయిగా ఖ్యాతి కెక్కనుంది.  మిషన్ కోవిడ్ సురక్ష లో భాగంగా ఈ ప్రాజెక్టు తయారు అవుతుంది.  దేశ అవసరాలకు తగ్గట్టుగా నాణ్యమైన, సురక్షితమైన, శక్తివంతమైన కోవిడ్ టీకాలను అందరికీ అందుబాటు ధరల్లో తీసుకు రావటమే ప్రధాన లక్ష్యం.  (VCCRC) విశాఖ పట్నం కోవిద్ క్లినికల్ రీసెర్చ్ సెంటర్ కోసం  కేంద్ర ప్రభుత్వ బాయోటెక్నాలజీ డిపార్ట్మెంట్  సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖా ఈ సెంటర్ కోసం  కోటి డబ్బయి లక్షలు  కేటాయించింది. ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ పి వి సుధాకర్ నేతృత్వంలో అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేశారు.  అయితే కేంద్ర ప్రభుత్వ అనుమతి పొందిన ఫార్మా కంపెనీ లు తయారు చేసిన టీకాలను దేశంలో ఎక్కడైనా ట్రయిల్ రన్ చేయవచ్చు ఇక పై విశాఖ కేంద్రాన్ని కూడా కేంద్రం ఎంపిక చేసింది ఆ నేపధ్యంలో సింహాచలం కేంద్రంలో స్వచ్ఛందంగా టీకా తీసుకోవటానికి వాలంటీర్లు ను మెడికల్ కాలేజీ ప్రోత్సహించి  క్లినికల్ ట్రయల్స్ సక్రమంగా జరిగేలా చూస్తుంది.  సింహాద్రి నాధుని పవిత్ర పుణ్య క్షేత్రం తరువాత భారత దేశంలో ఈ సెంటర్ వలన మరోసారి సింహాచలం విశాఖ పేరు  మార్మొగ నుంది.

 

Tags:The first Kovid clinical trials lab in Telugu states

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page