అన్ని మౌలిక వసతులతో టిడ్కో ఇళ్లు

0 7

ఏడాదిన్నర లోగా లబ్ధిదారులకు అందచేత
వచ్చే ఆరు నెలలో 80 వేల ఇళ్లు
టిడ్కో ఛైర్మన్ గా ప్రసన్న కుమార్  బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
విజయవాడ  ముచ్చట్లు :
టిడ్కో నెలకొల్పిన చాలా కాలం  తరువాత, పూర్తి స్థాయి ఛైర్మన్ గా నియమితులైన ప్రసన్నకుమార్ ను పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అభినందించారు. విజయవాడలోని టిడ్కో కార్యాలయంలో శనివారం సహచర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది  విష్ణు తదితరులతో కలిసి ప్రసన్నకుమార్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో  మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొని ప్రసగించారు.   మంత్రి మాట్లాడుతూ సాంకేతిక పరంగా విద్యావంతుడైన , డిపార్ట్ మెంట్ లో ఇంజనీర్ గా పని చేసిన వ్యక్తి టిడ్కోకు  ఛైర్మన్ గా నియమితులు కావడం హర్షణీయం. అధునాత టెక్నాలజీని ఉపయోగించుకుని, ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలన్న సంకల్పంతో టిడ్కోను నెలకొల్పినప్పటికీ, గత ప్రభుత్వంలోని అవకతవకల వల్ల దానిని సాధించలేకపోయారు.  గౌరవనీయ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేదలందరికీ ఇళ్లను  అందించాలన్న సంకల్పంతో కీలకమైన నిర్ణయాలు తీసుకుని పనులను వేగవంతం చేస్తున్నాము. బలహీన వర్గాల వారికి లబ్ధి చేకూరాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి పలు నిర్ణయాలు తీసుకున్నారు. పేదలకు లబ్ధి చేకూరేలా 300 చదరపు అడుగుల  ఇళ్ళను ఒక్క రూపాయికే అందచేస్తున్నాము. అంతే కాకుండా మిగిలిన లబ్ధిదారులు కట్టాల్సిన లక్ష రూపాయలు, 50 వేలను  కూడా సగానికి తగ్గిస్తూ మేలు చేకూర్చాము. ఇటీవల ముఖ్యమంత్రి గారి వద్ద జరిగిన సమిక్షా సమావేశంలో వచ్చే ఏడాదిన్నర కాలంలో లబ్ధిదారులందరికీ ఇళ్లను అందచేయాలని నిర్ణయించి, అందుకు  అనుగుణమైన కార్యాచరణతో పనులను వేగవంతం చేయాలని కార్యాచరణ రూపొందించాము. వచ్చే 6 నెలల కాలంలో సుమారు 80 వేల ఇళ్లను, ఆ పై  6 నెలల్లో మరో 80 వేల ఇళ్లు, మిగిలిన వాటిని తదుపరి ఆరు నెలల కాలంలో ఇలా మొత్తం 18 నెలల కాలంలో అన్ని మౌలిక వసతులతో టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందచేసేలా పనులు చేపట్టాము. ఈ నేపథ్యంలో టిడ్కో ఛైర్మన్ గా నియమితులైన ప్రసన్న కుమార్ ముఖ్యమంత్రిగారి లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తూ, నిర్దేశించిన సమయంలో ఇళ్లన్నటిని పూర్తి చేయించడంలో సఫలీకృతమై ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని  ఆకాంక్షించారు.

 

 

Tags:Tidco house with all the infrastructure

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page