మంచిర్యాల జిల్లా లో విషాదం ,వాగులో బాలుడు మృతి

0 11

 

మంచిర్యాలముచ్చట్లు :

- Advertisement -

స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఓ బాలుడు అదృశ్యమైన ఘటన స్థానికంగా ఉత్కంఠకు దారి తీసింది. తమ వెంట వచ్చిన స్నేహితుడు నీటమునిగి చనిపోవడంతో భయపడిన తోటి మిత్రులు అసలు ఆ విషయాన్ని భయటికి పొక్కనీయలేదు. బాధిత కుటుంబసభ్యులు పిర్యాదు చెయ్యడం తో పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి రంగంలోకి దిగి  విచారణ చేపట్టి వాస్తవాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు….మంచిర్యాల జిల్లా మందమర్రి లోని విద్యానగర్కు చెందిన గట్టయ్య- తిరుమల దంపతుల చిన్న కుమారుడు చిప్పకుర్తి చైతన్య(14) స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమయ్యాడు. మంగళవారం తండ్రి గట్టయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విచారణ ప్రారంభించిన పోలీసులు నలుగురు స్నేహితులతో చైతన్య నడుచుకుంటూ వాగువైపు వెళ్లిన్నట్లు గుర్తించారు…. వారిని పిలిపించి విచారణ చేపట్టగా.. మొదట తమకేమీ తెలియదంటూ నమ్మబలికారు. అనంతరం మరోసారి తమదైన శైలిలో విచారించగా అసలు విషయాన్ని వెల్లడించారు. పట్టణంలోని ఎర్రగుంటపల్లి గ్రామ శివారులోని పెద్దవాగులో ఈతకు వెళ్లినప్పుడు చైతన్య ప్రమాదవశాత్తు అందులో మునిగిపోయాడని వివరించారు. శుక్రవారం రాత్రి సీఐ ప్రమోద్రావు, శిక్షణ ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో సింగరేణి రెస్క్యూ సిబ్బంది సుమారు రెండు గంటల పాటు శ్రమించి కుళ్లిపోయిన మృతదేహాన్ని వెలికితీశారు. బాబు క్షేమంగా తిరిగి వస్తాడని నాలుగురోజుల పాటు నిరీక్షించిన తల్లిదండ్రులు మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు.

 

 

Tags:Tragedy strikes boy in Manchirala district

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page