టీఆరెఎస్, బిజెపి లది గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ

0 2

హైదరాబాద్  ముచ్చట్లు :
కేసీఆర్ పాలనలో మైనార్టీ లు దగాకు గురైయ్యారు. 12 శాతం రిజర్వేషన్ ఇస్తానన్న కేసీఆర్ హామీ అమలు కాలేదని ఎంపీ ఉత్తం కుమార్ రెడ్డి అన్నారు. శనివారం అయన ధర్నా చౌక్ లో జరిగిన కాంగ్రెస్ మైనార్టీ గర్జన కార్యక్రమంలో పాల్గోన్నారు. ఉత్తమ్ మాట్లాడుతూ మోదీ తో మాట్లాడాను .. 12 శాతం రిజర్వేషన్ అమలు చేస్తానని కేసీఆర్ అసెంబ్లీ లో చెప్పాడు. ముస్లిమ్ లు టీఆరెఎస్  ను నమ్మోద్దు . బీజేపీ,టీఆరెఎస్ ల మధ్య లోపాయకారి ఒప్పందం ఉంది. టీఆరెఎస్, బిజెపి లది గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ. కాంగ్రెస్ మైనార్టీల అభ్యున్నతికి కట్టుబడి ఉంది. దేశంలో బీజేపీ మతతత్వ రాజకీయాలతో లబ్ది పొందాలని చూస్తోంది. మోదీ పాలనలో మైనార్టీలు అభద్రత లో ఉన్నారు. మైనార్టీలు బీజేపీ కు బుద్ది చెప్పాలంటే రాష్ట్రంలో టీఆరెఎస్ ను గద్దె దించాలని అన్నారు. కేసీఆర్ అన్ని విషయాల్లో బీజేపీకి మద్దతు ఇస్తున్నాడు. వక్ఫ్ బోర్డు ఆస్తుల విషయంలో కేసీఆర్ ఏం చేశాడు. కాంగ్రెస్ ఎప్పుడు మైనార్టీ లకు అండగా ఉంటుందని అన్నారు.

Tags:TRS, BJP wrestling in Ladi Gully Dosti in Delhi

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page