రాజనాల బండ మహత్యంతోనే చోరిఅయిన నగలు తిరిగీ లభ్యం

0 33

– భక్తిశ్రధ్దలతో శ్రావణమాస తొలిశనివారపు పూజలు
– ప్రత్యేక అలంకారంలో స్వామివారు

 

చౌడేపల్లె ముచ్చట్లు:

 

- Advertisement -

సత్యప్రమాణాలకు నిలయమైన రాజనాలబండ మహత్యంతో నే చోరీ కాబడిన నగలు, నగదు దొరికాయని అలాగే పలు సమస్యలు పరిష్కారం అవుతున్నాయని భక్తులు తమ మనోభావాలను తెలిపారు. శనివారం కర్నాటక రాష్ట్రం ముళబాగిల్‌ కు చెందిన కె.మునస్వామి ఇంటిలో ఇరవై రోజుల క్రితం బీరువా లోని సుమరూ రూ:1.70 లక్షల విలువచేసే బంగారు నగలు అపహరించుకెళ్లారు. నగలు చోరీ అయ్యాయని గుర్తించిన మునస్వామి ఇంట్లోని వారితోపాటు, గ్రామపెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించినా ఫలితంలేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. చివరి గ్రామపెద్దల సూచనల మేరకు రాజనాలబండకు చేరుకొని ప్రమాణం చేయాలని తీర్మాణించారు. ఈమేరకు రాజనాల బండపై ప్రమాణం చేయాలని గ్రామపెద్దలు ప్రకటించారు. శనివారం ప్రమాణం చేసి ఇంటికెళ్ళగా చోరీ కాబడిన నగలు ఇంటి లో ప్రత్యక్షమయ్యాయి. నగలను గుర్తించిన బాధితులు తిరిగీ రాజనాలబండకు చేరుకొని స్వామివారికి పూజలు చేసి చోరికాబడి తిరిగీ లభ్యమైన నగలను స్వామివారి పాధాలచెంత పెట్టి పూజలు చేశారు. వారితోపాటు పలు గ్రామాలనుంచి నుంచి వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. తొలిశ్రావణమాస శనివారం కావడంతో భక్తులు స్వామివారికి ప్రత్యేకపూజలు చేశారు.

 

 దేశమంతా హై అలెర్ట్

Tags: With the greatness of Rajanala Banda, the stolen jewelery is back

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page