శబరిమల తరహ యాదాద్రి అభివృద్ది

0 25

యాదాద్రి  ముచ్చట్లు :
రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం నాడు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలలో  పాల్గొన్నారు. తరువాత యాదాద్రి హరిత హోటల్ లో  అయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా అయన ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పై విరుచుకుపడ్డారు. మంత్రి మాట్లాడుతూ యాదాద్రి అద్భుత కళాఖండం.  తిరుపతి దేవాలయం లా యాదాద్రి లో ఆ స్థాయిలో అభివృద్ధి జరుగుతుంది. కెసిఆర్ యాదాద్రి  నిర్మాణానికి పూనుకున్నారు. దేవుని దర్శనానికి, కళాఖండాన్ని చూడడానికి వచ్చే వారు చాలా మంది ఉన్నారు. అన్ని సౌకర్యాలతో గుడి నిర్మాణం జరుగుతుంది. పండగలు వస్తున్నాయి.. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణాల వరకు భక్తులు యాదాద్రి కి వస్తున్నారు. హుజురాబాద్ ఉపఎన్నిక లో బ్రహ్మాండమైన మెజారిటీ తో గెలవబోతున్నామని అన్నారు. యువకులకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నది టీఆర్ ఎస్ మాత్రమే. అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా నే సాధ్యం అవుతుంది. తెలంగాణ లో ఇబ్బందులు 2014 తరువాత లేదు. తాగడానికి మంచి నీరు అందుతుంది, కరెంటు కొరత లేదు…సాగు నీరు కోసం రెండు పంటలు రైతులు పండించుకోగలుగుతున్నారని అన్నారు. ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలు  కళ్యాణ లక్ష్మీ పథకం కింద ఇచ్చిన చరిత్ర  ఏ ప్రభుత్వానికి లేదు…ఏ రాష్ట్రంలో ఇవ్వటం లేదు. అన్ని వర్గాల ప్రజలకు పథకాలు అందుతున్నాయి. వాసాలమర్రి మరి కొన్ని రోజుల్లో అద్భుత మైన గ్రామం అవుతుంది. రాష్ట్రం లో ఏడు ఏళ్ల లో ఎంతో అభివృద్ధి జరిగింది. దళిత బంధు పథకం రాష్ట్రానికి సంబంధించింది…వాసాల మర్రి లో లాంఛనంగా ప్రారంభిం చారు…హుజురాబాద్ లో అమలు కానుంది. రైతు బంధు , రైతు బీమా పథకాల గురించి ఎవరైనా ఊహించారా ?  గొర్ల పంపకం రెండో విడత ప్రారంభం కానుంది. ఓట్ల కోసం రాజకీయాలు మాట్లాడితే ప్రజలు హర్షించరని అన్నారు. ముఖ్యమంత్రి ని వారి కుటుంబాన్ని ఏకవచనం తో మాట్లాడుతున్నారు.ఇది కరెక్ట్ కాదు. మా పార్టీ సభ్యులు 60 లక్షల మంది ఉన్నారు.  మాకంటే గొప్ప హిందువులా ? అంటూ బిజెపి ని ఉద్దేశించి అన్నారు. నిరుద్యోగుల కోసం ఉద్యోగ నోటిఫికేషన్లు రాబోతున్నా యి…ఇప్పటికే ప్రభుత్వం అంతా సిద్ధం చేసింది. కేంద్రం, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తున్నారు. వ్యాక్సిన్ విషయంలో కేంద్రం సహకరించడం లేదు. హైదరాబాద్ లో జీహెచ్ఎంసి ఎన్నికల్లో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కారు కు కారు, బైక్ కు బైక్ ఇస్తా అన్నారు. ఏమైంది ? నియోజకవర్గ అభివృద్ధి నిధులు 3 కోట్లు ఇస్తున్నా రు…దాన్ని 5 కోట్లు చేశారు. భక్తులకు కొత్త ప్రపోజల్ పెడుతున్నాం…శబరిమల లాగా యాదాద్రి దేవాలయం నిర్మాణం తరువాత 40 రోజుల దీక్ష చేసుకునేలా తీర్చిదిద్దుతామని అన్నారు.

Tags:Yadadri development like Sabarimala

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page