ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

0 107

రామసముద్రం  ముచ్చట్లు:

మండలంలో ఆదివారం75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎంపిడివో కార్యాలయంలో మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ భాస్కర్ గౌడు, సింగిల్ విండో చెర్మెన్ కేశవరెడ్డి, మాజీ. చెర్మెన్ కృష్ణారెడ్డి, మాజీ జెడ్పిటిసి రామచంద్రారెడ్డి, ఎంపిడివో శ్రీనివాసులు, ఎంఇఓ హేమలత, ఏపీఎం రాజేశ్వరి, ఏపీవో గౌరీశంకర్ నాయకులు రమణారెడ్డి, సుజ్ఞానమూర్తి, ప్రకాష్, రాధారెడ్డి, మున్వర్ బాషా, గెవన్న, ఆనంద, నంద తదితరులు జెండా ఎగురవేశారు. అలాగే పోలీస్ స్టేషన్ వద్ద సీఐ మధుసూదన్ రెడ్డి, ఎస్ ఐ రవీంద్రబాబు, తహసీల్దార్ కార్యాలయం వద్ద డిటి సాగర్, ట్రాన్స్ కో కార్యాలయం వద్ద ఎఇ అజయ్ బాబులు జెండా ఎగురవేసి జాతీయ గీతం పాడారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో కమిటీ చెర్మెన్ లు సర్పంచ్ లు , పంచాయతీ కార్యదర్సులు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందరికి మిఠాయిలు పంచి త్యాగమూర్తుల జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆయా సచివా లయాల్లో సర్పంచ్ లు రత్నమ్మ, కొండూరు శ్రీనాథరెడ్డి, ఉదయశంకర్ రెడ్డి, రెడ్డెప్పనాయుడు, రమణమ్మ, ఆదినారాయణ, రెడ్డెమ్మ, సుగుణమ్మ, మంగమ్మ, నవిత, నారాయణమ్మ, బాలప్ప, శ్రీనివాసులు రెడ్డి, జమున, ఎంపీటీసీ అభ్యర్థులు తదితరులు పాల్గొని వేడుకలు నిర్వహించారు.

- Advertisement -

 

Tags:Great Independence Day celebrations

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page