కాంగ్రెస్‌ పార్టీకి మరో ఎదురుదెబ్బ..!

0 18

డిస్పూర్‌ ముచ్చట్లు :

దేశవ్యాప్తంగా ప్రాభవం కోల్పోతున్న జాతీయ కాంగ్రెస్‌ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన కీలక నేత, అసోం మాజీ ఎంపీ సుస్మితా దేవ్‌ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె తన ట్విటర్‌ ఖాతా బయోలో కాంగ్రెస్‌ మాజీ సభ్యురాలు, మహిళ నేత అని మార్చి.. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మొదటి క్లూ ఇచ్చారు. సుస్మితా దేవ్‌ ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్‌ చీఫ్‌గా ఉన్నారు‌. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సుస్మితా దేవ్‌ త్వరలోనే తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సుస్మితా దేవ్‌ సోమవారం పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీతో భేటీ అవ్వనున్నట్లు తెలిసింది. సుస్మితా దేవ్ గతంలో తన తండ్రికి పట్టున్న సిల్చార్ సీటు నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.

 

- Advertisement -

Tags:Another setback for the Congress party ..!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page