ఎమ్మెల్యే మైనంపల్లి వ్యాఖ్యాలకు వ్యతిరేకంగా బీజేపీ అందోళన

0 18

హైదరాబాద్ ముచ్చట్లు :
మేడ్చల్ జిల్లా  కొంపల్లి పరిధి దూలపల్లి లోని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు ఇంటి వద్ద బిజెపి యస్.సి.మహిళా మోర్చ  కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కార్పొరేటర్ శ్రవణ్ పై తెరాస శ్రేణుల దాడిలో గాయపడడంతో అతడిని పరామర్శించిన బండి సంజయ్…మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు పై ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దానికి బదులుగా ఎమ్మెల్యే మైనంపల్లి …బండి సంజయ్ పై విరుచుకపడుతూ తీవ్రమైన పదజాలంతో ఆయనను దూషించారు. దాంతో భాజపా కార్యకర్తలు మండిపడుతూ కొంపల్లి పరిధి దూలపల్లి లోని మైనంపల్లి ఇంటి వద్ద మహిళా కార్యకర్తలు ఆందోళన చేపట్టడంతో వారి వ్యక్తిగత సిబ్బంది దాడి చేసినట్లు ఆరోపించారు. ఇంటి వద్ద ఆందోళన చేయడంతో పోలీసులు వారిని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దాంతో స్థానిక భాజపా నాయకులు స్టేషన్ కు చేరుకుని అందోళనకు దిగారు.
మరోవైపు,  మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసన గా ఎంజే మార్కెట్ దగ్గర  బిజెపి నేతలు ఆందోళన కు దిగారు. బిజెపి ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసారు. అనంతరం రోడ్డు పై బైఠాయించి ఆందోళన చేస్తున్న మోర్చా అధ్యక్షుడు ఆలే భాస్కర్ తో పాటు పలువురు నాయకులను పోలీసులు  అరెస్ట్ చేసారు. వారిని బేగంబజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

 

Tags:BJP agitation against MLA Mainampalli’s remarks

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page