స్వాతంత్ర యుద్దం లో పాల్గొన్న మహా నాయకురాళ్లను స్మరిస్తూ గాలిపటాలు ఎగురవేసిన బిజెపి మహిళా మోర్చా

0 4,592

నెల్లూరు ముచ్చట్లు:
అజాదికా అమృత్ మహోత్సవ్  కార్యక్రమం సోమవారం పల్లెపాడు గ్రామం లో గాంధీ ఆశ్రమంలో జరిగింది. భారత దేశ 75 వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని, ఆనాడు  స్వతంత్ర ఉద్యమములో పాల్గొన్న నాయకురాళ్లను స్మరిస్తూ, వారి స్ఫూర్తి ,త్యాగం  జ్ఞాప్తికి  తెచ్చుకుని వారి చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి ,గాలి పఠములు ఎగుర వేసి  కార్యక్రమం బిజెపి మహిళా మోర్చా విభాగం సోమవారం నిర్వహించింది. ఈ కార్యక్రమం  నెల్లూరు పట్టణంలో  పోనక కనకమ్మ  స్మారక చిహ్నం పల్లిపాడు లో ఉన్న గాంధి ఆశ్రమంలో నెల్లూరు మహిళా మోర్చా అధ్యక్షురాలు కంది కట్ల రాజేశ్వరి  ఆధ్వర్యంలో నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మహిళా మోర్చా అధ్యక్షరాలు  నిర్మలా కిషోర్  ,బీజేపీ ఉపాధ్యక్షురాలు  తుమ్మల పద్మజా ప్రకాష్  ,ఆజాదికా అమృత్ మహోత్సవ ప్రోగ్రాం ఇంచార్జ్ పాల్గొన్నారు. ఈ  సందర్భంగా ఆమె మాట్లాడుతూ కనకమ్మ  జీవితం ఆనాడు మహిళలు విద్య కొరకు , పాఠశాలలు స్థాపించి మహిళా అభ్యున్నతికి పాటుపడ్డారని, ఉద్యమము కొరకు ఆమె ఆస్తిని దాన ధర్మాలు చెయ్యడం ఎంతో గొప్ప త్యాగం అని ఆమె సేవలను కొనియాడారు. ప్రతి భారతీయ మహిళా ఇటువంటి మహనీయురాలు సేవల ను గుర్తు పెట్టుకొని, సామాజిక సేవలకు సమయం వెచ్చించి, అభ్యుదయ సమాజము నకు మరిన్ని బాటలు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజయశ్రీ, సుభాషిని, లక్ష్మీ ప్రసన్న, నాగవేణి, లక్ష్మీదేవి, ఝాన్సీ లక్ష్మి, మాధవి, అంజలి దేవి మరియు శ్రీనివాస్, సాయి ,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

 

Tags:BJP Mahila Morcha hoists kites in memory of freedom fighters

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page