చిల్లర గ్యాంగ్ అంటూ బాబుపై కామెంట్స్

0 8,604

విజయవాడ  ముచ్చట్లు:

తెలుగు దేశం పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి మరోసారి రెచ్చిపోయారు. చంద్రబాబును ఉద్దేశించి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అలాగే టీడీపీ నాయకులను చిల్లర గ్యాంగ్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, ఆయన చిల్లర గ్యాంగ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నలువైపుల నుంచి మర తుపాకులతో కాల్పులు జరుపుతున్నామని భ్రమపడుతుంటారని ఎద్దేవా చేశారు.ముఖ్యమంత్రి ఇక ఫినిష్షే అన్నట్లుగా వాళ్ల వాలకం ఉంటుందని విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. అయితే, అవి పిట్టల దొరల దగ్గరుండే లొట్ట తుపాకులని.. వాటిని చూసుకుని ప్రభుత్వాన్ని కూలుస్తాం, ఆర్టికల్ 370 తెస్తాం అని బీరాలు పోతుంటారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి సోమవారం ట్వీట్ చేశారు.బాబు, ఆయన చిల్లర గ్యాంగు జగన్ గారిపై నలువైపుల నుంచి మర తుపాకులతో కాల్పులు జరుపుతున్నామని భ్రమ పడుతుంటారు. ఇక ఫినిష్షే అన్నట్టు ఉంటుంది వాళ్ల వాలకం. అవి పిట్టల దొరల దగ్గరుండే లొట్ట తుపాకులు. వాటిని చూసుకుని ప్రభుత్వాన్ని కూలుస్తాం, ఆర్టికల్ 370 తెస్తాం అని బీరాలు పోతుంటారు.’’ అంటూ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు.

 

- Advertisement -

Tags:Comments on Babu as a retail gang

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page