మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో కామన్ ఎంట్రన్స్ పరీక్షలు

0 2,595

మేడ్చల్ ముచ్చట్లు:
అర్హులైన విద్యార్థులను గుర్తించేందుకు, స్కాలర్ షిప్స్ మంజూరు చేసేందుకు గాను మల్లారెడ్డి విశ్వవిద్యాలయం ఆగస్ట్ 21 మరియు 22 వ తేదీల్లో కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ లు ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఛాన్సలర్ డి.ఎన్. రెడ్డి. విశ్వవిద్యాయంలో ప్రవేశాల కోసం విద్యార్థులు ఆన్ లైన్ లో ఆగస్ట్ 20 2021వ తేది వరకు పరీక్ష కొరకు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అన్ని స్టేట్ బోర్డులు, సెంట్రల్ బోర్డ్, భారత దేశంలో గుర్తింపు పొందిన విద్యాలయాలకు చెందిన విద్యార్థులందరూ ఈ ఎంట్రన్స్ టెస్ట్ లో పాల్గొనేందుకు అర్హులుగా పరిగణిస్తామని తెలిపారు.
మల్లారెడ్డి విశ్వవిద్యాలయం చాన్సెలర్ డాక్టర్ డి.ఎన్. రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ… మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు విలువల ఆధారిత భవిష్యత్ ప్రయోజనకర ఉన్నత విద్యను అందించడమే తమ ధ్యేయమన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీపడే విధంగా విద్యార్థులను తయారు చేయడం, సాంస్కృతికంగా, నైతికంగా, వృత్తిపరంగా నిపుణులుగా వారిని మార్చడమే తమ లక్ష్యమని అన్నారు. ఈ విద్యా సంవత్సరంలో మెరిట్ విద్యార్థులకు, ఆర్థికంగా వెనకబడిన విద్యార్థుల కోసం స్కాలర్ షిప్స్ సీట్లను ప్రవేశ పెడుతున్నట్లు తెలిపారు. విశ్వవిద్యాలయంలో నాణ్యమైన ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఇక్కడ ఒక మంచి అవకాశం అందిస్తుందని” అన్నారు.

 

Tags:Common Entrance Examinations at Mallareddy University

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page