2 శాతానికి పడిపోయిన కోరనా పాజిటివ్ రేటు

0 8,915

విజయవాడ  ముచ్చట్లు:
ఏపీలో కరోనా తీవ్రత కాస్త తగ్గినట్టుగా కనిపిస్తుంది. కొత్తగా 46962 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 909 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1994606కు చేరింది. మరో 13 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. ఈ మరణాలతో కలుపుకుని రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 13660 కి చేరింది. కొత్తగా 24 గంటల వ్యవవధిలో  1543 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 1963728కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 17218 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
● కరోనా సంబంధించిన అధికారిక సమాచారం కోసం వాట్సాప్ చాట్ బాట్ నంబర్ (8297-104-104) కు Hi, Hello, Covid అని మెసేజ్ చేయడి.
● స్మార్ట్ ఫోన్ లేని వారు (8297-104-104) కు ఫోన్ చేసి IVRS ద్వా రా కరోనాకు చెందిన సమాచారం, సహాయం పొందవచ్చు
● 104 టోల్ ఫ్రీ కు ఫోన్ చేసి కరోనా సంబంధించిన వైద్య సమస్యలు తెలుపవచ్చు
● https://esanjeevani.com/ వెబ్ సైట్ ద్వా రా డాక్టర్ గారిని వీడియో కాల్ లో సంప్రదించి, కరోనాకు సంబంధించిన వైద్య సహాయం పొందవచ్చు.
● కోవిడ్19 పై సమగ్ర సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మీకు అందిస్తుంది COVID-19 AP app. క్రింద లింక్ నుంచి ఆప్ డౌన్లోడ్ చేసుకోండి, రాష్ట్రలో కోవిడ్ సమాచారం తెలుసుకోండి.

 

 

Tags:Corona positive rate dropped to 2 percent

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page