ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా దళిత బంధు

0 4,590

కరీంనగర్  ముచ్చట్లు:

శాలపల్లిలో ప్రారంభించిన రైతుబంధు అద్భుతమైన ఫలితాలను సాధిస్తోందని సీఎం కేసీఆర్‌ గుర్తు చేశారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న దళితబంధును కూడా ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నామని సీఎం కేసీఆర్‌ అన్నారు. శాలపల్లిలో దళితబంధు పథకాన్ని ముఖ్యమంత్రి KCR లాంఛనంగా ప్రారంభించారు. శాలపల్లిలోని దళిత బంధు ప్రారంభోత్సవ సభకు చేరుకున్న సీఎం KCR.. జై భీమ్‌ అంటూ ప్రసంగాన్ని మొదలు పెట్టారు. CM KCR మాట్లాడుతూ.. దళితబంధు పథకంతో దళితులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ సింహగర్జన కరీంనగర్‌లోనే జరిగిందని గుర్తు చేశారు. మరో అద్భుతమైన కార్యక్రమానికి కరీంనగర్‌లోనే శ్రీకారం చుడుతున్నామని చెప్పారు.తెలంగాణ సాకారమైనట్లే ఎస్సీల అభివృద్ధి కూడా జరిగి తీరాలన్నారు. దళితబంధు పథకంతో మరో నాలుగేళ్లలో అద్భుత ఫలితాలు వస్తాయన్నారు. ఏడాది క్రితమే ఈ పథకాన్ని ప్రారంభించాలని అనుకున్నానని.. కానీ, కోవిడ్ వ్యాప్తి కారణంగా ఏడాది ఆలస్యమైందని సీఎం కేసీఆర్‌ వివరణ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగం ఉన్న కుటుంబాలకు కూడా దళితబంధు వర్తింపజేస్తామని శాలపల్లిలో స్పష్టం చేశారు.అంతే కాదు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ భగీరథ పథకాన్ని చూసి మిగతా రాష్ట్రాలు మొదలు పెట్టాయని అన్నారు. ఈ పథకం ద్వారా చిత్తశుద్ధి ఉంటే ఎంతటి లక్ష్యమైనా సాధించవచ్చని నిరూపించామని అన్నారు. ఇతర పార్టీలకు రాజకీయం అనేది ఒక క్రీడ… పేదలకు రూపాయి ఇవ్వని పార్టీలు కూడా విమర్శలు చేస్తున్నాయని అన్నారు. దళిత బంధును విజయవంతం చేసే బాధ్యత ఎస్సీ విద్యార్థులపై ఉందన్నారు. నూటికి నూరు శాతం దళితబంధును అమలు చేస్తామని CM KCR పునరుద్ఘాటించారు.ళితబంధు పథక ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దళితబంధును విజయవంతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ‘ప‌ట్టుబ‌ట్టి, జ‌ట్టు క‌ట్టి ద‌ళిత జాతిని బాగు చేసుకుందాం. ద‌ళిత జాతిలో ఉన్న ర‌త్నాల‌ను వెలికితీద్దాం. జాతిలో ఉన్న శ‌క్తిని బ‌య‌ట‌కు తీద్దాం. ఆ శ‌క్తితో రాష్ట్ర సంప‌ద పెరుగుతుంది. ఆర్థిక ప్ర‌గ‌తి కూడా రాష్ర్టానికి దోహ‌ద‌ప‌డుతుంది. ద‌ళిత ఉద్యోగులు, ర‌చ‌యిత‌ల స‌భ‌లు మొద‌లుపెడుతాం. ఈ ప‌థ‌కం అమ‌లుకు చ‌ర్చ‌లు చేప‌డుతాం’ అని చెప్పారు. ళితబంధు విజయం సాధించి తీరుతుందని, దాన్ని మరింత విజయవంతం చేయాల్సిన బాధ్యత దళిత మేధావులు, రచయితలు, ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, యువతదేనని సీఎం కేసీఆర్‌ అన్నారు. ‘దళిత బంధును విజ‌యం సాధించితీరుతది. నిన్న‌నే 75వ స్వాతంత్ర్య దినోత్స‌వం జ‌రుపుకున్నాం. ఈ 75 ఏండ్ల‌లో భార‌త‌దేశంలో ప్ర‌ధాని, పార్టీ కానీ ద‌ళిత కుటుంబాల‌ను ఆదుకోవాలే, ఇంటికి రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని ఎవ‌రైనా మాట్లాడారా? క‌నీసం వాళ్ల మైండ్‌కైనా వ‌చ్చిందా? ఆ దిశ‌గా ఆలోచ‌న చేసిండ్రా? చేయ‌లేదు. ఈ పథకం ఏడాది కిందనే మొద‌లుకావాలి. కానీ క‌రోనా వ‌ల్ల సంవ‌త్స‌రం ఆల‌స్య‌మైంది. ఐదు రూపాయాలు కూడా ఇవ్వ‌లేనోడు.. ఇప్పుడు ఏదేదో మాట్లాడుతుండు. ప‌క్క‌న బాంబులు ప‌డ్డ‌ట్టు భ‌య‌ప‌డుతుండ్రు. ద‌ళితులు బాగుప‌డొద్దా. ఎవ‌రెవ‌రకి ఇస్తారో అని చెప్పాలంటుండ్రు. కుండబ‌ద్ధలు కొట్టి చెబుతాం, అందరికీ ఇస్తాం. ద‌ళిత మేధావులు, ర‌చ‌యిత‌లు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, యువ‌త‌కు మ‌న‌వి చేస్తున్నా. ఈ ప‌థ‌కాన్ని విజ‌య‌వంతం చేసే బాధ్య‌త మీ మీద‌నే ఉంది’ అని సీఎం తెలిపారు.మొత్తం మంత్రివ‌ర్గం, పార్లమెంట్ స‌భ్యులు, శాస‌న‌స‌భ్యులు, ఎమ్మెల్సీలు వేదికపై ఉన్నారని, రాష్ట్రంలో ఉన్న మొత్తం అధికారుల త‌ర‌పున నూటికి నూరు శాతం విజ‌య‌వంతం చేస్తామ‌ని సీఎస్ సోమేశ్ కుమార్ హామీ ఇచ్చారని ముఖ్యమంత్రి గుర్తుచేశారు
నేను గెలుస్తానని నా భార్య ఆశీర్వాదం ఇచ్చింది: సీఎం
‘ద‌ళిత బంధు ప‌థ‌కం గురించి నా భార్య‌ను అడిగిన. త‌ప్ప‌కుండా చెయ్యు, గెలుస్తావు అని ఆశీర్వాదం ఇచ్చింది. నా జీవితంలో ఏది చేప‌ట్టిన వెనుక‌కు పోలేదు. ముందుకే పోయిన. యావ‌త్ తెలంగాణ హ‌ర్షించే విధంగా, భార‌త‌దేశ‌మే ఆశ్చ‌ర్య‌ప‌డే విధంగా మ‌నం ముందుకు పోవాలె. ఓపిక‌, ఓర్పు, నేర్పు, స‌హ‌న‌శీల‌త అవ‌స‌రం. ఈ స్కీం అమ‌లులో జిల్లా క‌లెక్ట‌ర్లు ప్ర‌ధాన పాత్ర పోషిస్తారు. అందరం కలిసి ముందుకు పోవాలె. అంద‌రం క‌లిసి ప‌ట్టుబ‌ట్టి సాధించాలి’ అని వెల్లడించారు. చివరగా.. జై దళితబంధు.. జై భీమ్.. జై హింద్.. జై తెలంగాణ అని ప్రసంగాన్ని ముగించారు.

 

- Advertisement -

Tags:Dalit relative regardless of government job

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page