వికలాంగుల బంధు పథకాన్ని ప్రవేశపెట్టాలి

0 4,592

వికలాంగుల హక్కులను పటిష్టంగా అమలు చేయాలి

జగిత్యాల  ముచ్చట్లు:
వికలాంగుల హక్కులను రాష్ట్ర ప్రభుత్వం పటిష్టంగా అమలు చేయాలని ,దళిత బంధు తరహాలో వికలాంగ బంధు పథకాన్ని అమలు చేయాలని జగిత్యాల జిల్లా వికలాంగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు లంక దాసరి శ్రీనివాస్, మహ్మద్ అస్ఘర్ ఖాన్ లు అన్నారు. సోమవారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ప్రకటన విడుదల చేశారు. వికలాంగుల హక్కులు స్వాభావికమైన అంశాలని ఐక్యరాజ్య సమితి తో 2007 లో భారత ప్రభుత్వం ఒప్పందం చేసుకొందన్నారు. దేశంలో వికలాంగుల పరిస్థితి అద్వాన్నంగా ఉందని అంతకు మించి రాష్ట్రంలో ఉందని లంక దాసరి శ్రీనివాస్, మహ్మద్ అస్ఘర్ ఖాన్ లు ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో 45 లక్షలకు పైగా వికలాంగ కుటుంబాలు ఉన్నాయని మానసిక, ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాయన్నారూ. అయిన రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సంక్షేమ కోసం సమగ్రమైన చర్యలు చేపట్టడం లేదని అన్నారు. వికలాంగులు నేటికి తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్లపై బైటాయించే పరిస్థితి దాపరించిందన్నారు. ఇకనైనా ప్రభుత్వం, అధికారులు వికలాంగుల హక్కులను పంచాయతీ నుంచి మొదలుకొని పార్లమెంట్ వరకు పటిష్టంగా అమలు చేస్తేనే వికలాంగులకు న్యాయం జరుగుతుందని అన్నారు. అలాగే దళిత బంధు తరహాలో వికలాంగుల బంధు పథకాన్ని అమలు చేయాలని వారు కోరారు.  ప్రభుత్వాలు తమ ధోరణిని మార్చుకోకుంటే  వికలాంగుల హక్కులను సాధించుకోవదానికి రాష్ట్రంలో 25 శాతం ఓటు బ్యాంకును కలిగిన వికలాంగులు ఒక్కటై బుద్ది చేప్పాలని లంక దాసరి శ్రీనివాస్, మహ్మద్ అస్ఘర్ ఖాన్ లు పిలుపునిచ్చారు.

 

- Advertisement -

Tags:Disability kinship scheme should be introduced

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page