గుంటూరు బిటెక్‌ విద్యార్థి రమ్యశ్రీ కుటుంబానికి రూ.10లక్షలు ఇవ్వాలి-పుంగనూరు దళిత నేతల డిమాండు

0 5,044

పుంగనూరు ముచ్చట్లు:

 

గుంటూరు జిల్లా పెద్దకాకానిలో హత్యకు గురైన దళిత బిటెక్‌ విద్యార్థి రమ్యశ్రీ కుటుంభానికి రూ.10లక్షలు ఆర్థికసహయం అందించాలని దళిత సంఘ నేతలు డిమాండ్‌ చేశారు. సోమవారం మాలమహనాడు రాష్ట్ర కార్యదర్శి ఎన్‌.ఆర్‌.అశోక్‌, ఎంఆర్‌పిఎస్‌ అధ్యక్షుడు నరసింహులు తో కలసి అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అశోక్‌ మాట్లాడుతూ దళిత కులానికి చెందిన రమ్యశ్రీని హత్య చేసిన నిందితున్ని తక్షణమే అరెస్ట్ చేయాలన్నారు. అలాగే దళితులపై దాడులకు పాల్పడుతున్న వారిని ఎన్‌కౌంటర్‌ చేయాలని డిమాండు చేశారు. దళితులకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు శ్రీనివాసులు, మంజునాథ్‌, రెడ్డెప్ప, నాగరాజు, బాలాజి తో పాటు ఏఐటియుసి కార్యదర్శి వెంకట్రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

ఎల్‌బ్రస్‌ శిఖరం అధిరోహించిన తెలుగు యువతి

Tags: Guntur BTech student Ramyashree’s family should be given, Rs 10 lakh: Punganur Dalit leaders demand.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page