ఇంట్లో నే డ్రగ్స్ తయారీ…గుట్టు రట్టు చేసిన ఎన్సీబీ అధికారులు

0 19

హైదరాబాద్    ముచ్చట్లు:

హైదరాబాద్‌లో నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో దాడులు నిర్వహించి.. భారీగా డ్రగ్స్‌ను పట్టుకుంది. ఈ దాడుల్లో ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. బాలానగర్‌లోని ఓ ఇంట్లో నిర్వహిస్తున్న ప్రైవేటు ల్యాబ్‌పై హైదరాబాద్, బెంగళూరు నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు భారీగా మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో 3.25 కిలోల ఆల్ఫ్రజోలం, రూ.12.75 లక్షల నగదు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం ఐదుగురిని అరెస్టు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. బాలనగర్లో నివసిస్తున్న సుధాకర్ అనే వ్యక్తి గత రెండు నెలలుగా ఇంట్లోనే ల్యాబ్ ఏర్పాటు చేసి మత్తు పదార్థాలు తయారు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. తరువాత బెంగళూరు, హైదరాబాద్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. కాగా డ్రగ్స్ ఎవరెవరికీ సరఫరా చేస్తున్నారు. వీటికి సంబంధించి ముడి సరుకు ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు. దీని వెనుక ఎవరైనా కీలక వ్యక్తులు ఉన్నారా..? అనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

 

 

- Advertisement -

Tags:Home-made drugs … NCB officials conspired

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page