విద్యార్థిని ,విద్యార్థులకు జగనన్న విద్యా కానుక అందజేత

0 5,839

కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రూరల్ ఎమ్మెల్యే
నెల్లూరు   ముచ్చట్లు:

నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జగనన్న విద్యా కానుక క్రింద నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని, విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, యూనిఫామ్ లను  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ కే.వి.ఎన్. చక్రధర్ బాబు అందజేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడం ద్వారా ప్రపంచంలో ఎవరితోనైనా పోటీపడే సామర్థ్యాలను సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి  రాష్ట్ర విద్యార్థుల్లో నెలకొల్పుతున్నారు అని అన్నారు. మంచి పౌరులుగా తీర్చిదిద్దుతూ అత్యుత్తమ మానవ వనరుల తయారీయే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నారు అని పేర్కొన్నారు వారి భవిష్యత్తుకు పటిష్ట పునాదులు వేస్తూ, విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారు అని పేర్కొన్నారు.ఇందులో భాగంగా ‘మనబడి నాడు–నేడు’ ద్వారా తొలి విడత కింద రూ.3,669 కోట్లతో సర్వాంగ సుందరంగా 15,715 ప్రభుత్వ స్కూళ్లను ఆధునీకరిస్తున్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికార పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

కొరటాల ఐసోలేషన్ సెంటర్ చేసిన కోవిడ్ సేవలను గుర్తించి వారికి ప్రశంశా పత్రాలను అందజేస్తున్న -భూమన కరుణాకర్ రెడ్డి,

Tags:Jagannath’s educational gift to the student

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page