మెగా పల్లె ప్రకృతి వనం పనులు ప్రారంభం

0 3,667

పెద్దపల్లి      ముచ్చట్లు:
పెద్దపల్లి జిల్లా రత్నపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో మేడిపల్లి శివారులో సోమవారం మెగా పల్లె ప్రకృతి వనం పనులు ప్రారంభమయ్యాయి. మంథని డి ఎల్ పి ఓ తేజావత్ రాంబాబు, ఎంపీడీవో తూమట్ల విజయ్ కుమార్, సర్పంచ్ పల్లె ప్రతిమ పివిరావు లు పనులను పరిశీలించారు. 10 ఎకరాల భూమిలో 31 వేల మొక్కలు నాటలను ప్రభుత్వం నిర్ణయించిందని వారు తెలిపారు. జేసీబీ తో ట్రెంచింగ్ పనులు, బ్లేడ్ డోజర్ తో భూమి చదును పనులు జరిగాయి. మొక్కలు వివిధ నర్సరీ ల నుంచి తెప్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిఓ కాటం భాస్కర్, ఉపాధి ఏపిఓ నర్సింగ్ రమేష్, ఈ సి రాసపల్లి లక్ష్మణ్, టెక్నికల్ అస్సిటెంట్ చిప్పకుర్తి కిరణ్, సెక్రెటరీ ఉప్పులేటి ప్రదీప్,కారోబర్ కొండపర్తి శ్రీనివాస్, వార్డ్ సభ్యులు కొవ్వూరి సురేష్, సందేవేన కుమార్, సాగర్ల తిరుపతి, ధర్ముల వెంకటేష్, బెజ్జల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

 

Tags:Mega rural nature forest works begin

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page