కాశీబుగ్గలో మంత్రి సిదిరి అప్పలరాజు పర్యటన

0 4,591

పలాస  ముచ్చట్లు:
నాడు నేడులో భాగంగా మంచి భవనాలు, రంగురంగుల బొమ్మలు, అధునాతన ఫర్నిచర్ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ నూతన విద్యా విధానానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. జోరుగా వర్షం కురుస్తున్నప్పటికీ ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులున్న తీరు క్రమశిక్షణకు నిదర్శనం అన్నారు.మనబడి నాడు-నేడు మొదటి దశ జాతికి అంకితం అనే కార్యక్రమం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ జిల్లా పరిషత్ హైస్కూల్లో సోమవారం ఏర్పాటు చేసిన సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించి, వంటగది, తరగతి గదులు పరిశీలించారు. విద్యార్థుల కోసం తయారు చేసిన భోజనాన్ని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 16 వేల కోట్ల రూపాయలతో 56 వేల పాఠశాలలు ఆధునికీకరణ చేసేందుకు ప్రణాళికలు తయారు చేయగా, మొదటి దశలో రూ. 3600 కోట్ల రూపాయలతో పూర్తి చేశామన్నారు. జగనన్న ఏది చెబితే అది తప్పక చేస్తారని కితాబునిచ్చారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు తయారయ్యాయని, ఇప్పుడు ఏ పాఠశాలలు మూతబడతాయో చూద్దామన్నారు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా మొట్టమొదట ఆంధ్రరాష్ట్రంలో అడుగులు వేసింది అన్నారు. తాను ఇటువంటి పాఠశాలలో చదువుకోలేకపోయానని, మిమ్మల్ని చూస్తే అసూయగా ఉందా అంటూ సరదాగా చిన్నారులతో వ్యాఖ్యానించారు. ఇకపై ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన కొనసాగుతుందని, పాఠశాలలను 6 కేటగిరీలుగా విభజించారని వివరించారు. అంగన్వాడీ కేంద్రాలను శాటిలేషన్ ఫౌండేషన్ స్కూల్స్ గా మార్పు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు పాఠశాలను బాగు చేసే ఆలోచన చరిత్రలో ఏ నాయకుడికి రాలేదని, భావితరాలకు ఇచ్చే ఆస్తి … నాణ్యమైన విద్య అని జగన్ మోహన్ రెడ్డి తమతో ఎప్పుడూ చెబుతూ ఉంటారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు, వైస్ చైర్మన్ మీసాల సురేష్, తాసిల్దార్ మధుసూదన్, ఎంపీడీవో రమేష్ నాయుడు, ఎంఈఓ శ్రీనివాసరావు, మెప్మా పిడి కిరణ్ కుమార్, ఎస్ఎంసి చైర్మన్ ఫ్రాన్సిస్ తో పాటు పలువురు కౌన్సిలర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

 

Tags:Minister Sidiri Appalaraju’s visit to Kasibugga

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page