భక్తిశ్రద్ధలతో మొహరం వేడుకలు

0 6,866

జగిత్యాల    ముచ్చట్లు:
జగిత్యాల జిల్లాలో మొహరం వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ వేడుకలను పురస్కరించుకొని గ్రామ, మండల కేంద్రాల్లోని కూడళ్లలో ఏర్పాటు చేసిన పీరిలా వద్ద మహిళలు, పిల్లలు భక్తులు పీర్ల ను దర్శించుకుని కానుకలు సమర్పించుకుంటున్నారు. ఈ వేడుకలను పురస్కరించుకుని గ్రామ, పట్టణ విధుల్లో పులి వేషాల సందడి ఆకట్టుకుంది. జిల్లాలోని ముఖ్య పట్టణాల్లో ఏర్పాటు చేసిన పీర్ల వద్ద మతాలకు అతీతంగా భక్తులు బారులు తీరి మొక్కులు చెల్లించుకోవడంతో పీర్ల వద్ద హడావిడి నెలకొంది. అటు జిల్లా కేంద్రమైన జగిత్యాల పట్టణంలోని మోచి బజార్ లో పెద్ద సంఖ్యలో మహిళలు తమ పిల్లతో దర్శించుకుని కానుకలు సమర్పించుకుంటున్నారు. ముఖ్యంగా మొహర్రం వేడుకలు ప్రారంభమైన నాటి నుండి గ్రామాల్లో పండగ పండగ వాతావరణం నెలకొంది.గురు, శుక్రవారంనాడు నిమజ్జనం..గురువారం, శుక్రవారంనాడు కూడల్లో నిలిపిన పీర్లను నిమజ్జనం చేయనున్నట్లు జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన నిర్వాహకులు తెలిపారు.

కొరటాల ఐసోలేషన్ సెంటర్ చేసిన కోవిడ్ సేవలను గుర్తించి వారికి ప్రశంశా పత్రాలను అందజేస్తున్న -భూమన కరుణాకర్ రెడ్డి,

- Advertisement -

Tags:Moharram ceremonies with devotion

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page