నారా లోకేశ్ అరెస్ట్..

0 30

గుంటూరు ముచ్చట్లు :

 

తెలుగుదేశం పార్టీ అగ్ర నేత నారా లోకేశ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ తరలించారు. గుంటూరులో ఉన్నాది చేతిలో దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబాన్ని టీడీపీ నేతలు నారా లోకేశ్, ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజా తదితర నేతలు పరామర్శించారు. టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో రాజకీయ లబ్ధి కోసమే నారా లోకేశ్ వచ్చారంటూ వైసీపీ శ్రేణలు ఆరోపించాయి. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం నెలకొంది. అక్కడే ఉన్న పోలీసులు టీడీపీ నేతలను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ నేతలు నినాదాలు చేశారు. నారా లోకేశ్, నరేంద్ర, ఆనంద్ బాబు, ఆలపాటి రాజా లతో పాటు పలువురు నేతలను అరెస్ట్ చేశారు.

 

- Advertisement -

గుంటూరు బిటెక్‌ విద్యార్థి రమ్యశ్రీ కుటుంబానికి రూ.10లక్షలు ఇవ్వాలి-పుంగనూరు దళిత నేతల డిమాండు

Tags: Nara Lokesh arrested ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page