జాతీయ జెండా ఉల్టా పల్టా.. కేరళ బీజేపీ చీఫ్‌పై కేసు నమోదు

0 31

తిరువనంతపురం ముచ్చట్లు : కేరళలోని తిరువనంతపురంలో జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేశారు. ప్రస్తుతం ఈ సంఘటన రాజకీయంగా కలకలం రేపుతోంది. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్నిపురస్కరించుకుని కేరళ బీజేపీ చీఫ్‌ కె. సురేంద్రన్‌ తమ కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. సరైన అవగాహన లేకుండా తలకిందులుగా ఉన్న జెండాను అలాగే ఎగురవేశారు.

కాసేపటికి దీన్ని గమనించిన అక్కడి నేతలు తిరిగి జెండాను సరిచేసి ఎగురవేశారు. అప్పటికే పలువురు స్థానికులు దాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఆ క్లిప్పింగ్‌లు కాస్త వైరల్‌ కావడంతో పోలీసులు సదరు బీజేపీ నాయకుడిపై కేసు నమోదు చేశారు.

- Advertisement -

Tags: National flag upside down, Case registered, against ,Kerala BJP chief

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page