సీఎం ఇంటిపై పెట్రో బాంబ్ దాడి..!

0 12

షిల్లాంగ్‌ ముచ్చట్లు :

మేఘాలయలో నేషనల్ లిబరేషన్ కౌన్సిల్‌(హెచ్‌ఎన్‌ఎల్‌సీ) మాజీ నేత చెరిష్‌స్టార్ఫీల్డ్ థాంగ్‌కీని పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంతో హింసాత్మక ఘటనలు తలెత్తాయి. థాంగ్‌కీ మద్దతుదారులు.. కొన్ని చోట్ల ప్రభుత్వ వాహనాలపై దాడులు చేశారు. ఓ చోట పోలీస్ వాహనానికి ఆందోళనకారులు నిప్పుపెట్టారు. అంతటితో ఆగక ఏకంగా ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా వ్యక్తిగత నివాసంపై ఆదివారం ఆందోళనకారులు పెట్రోల్ బాంబులు విసిరారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక, ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా.. ప్రస్తుతం తన అధికారిక నివాసంలో ఉంటున్నారు. ఆందోళనకారలు 3 వ మైలు ఎగువ షిల్లాంగ్‌లోని లైమర్‌లోని ముఖ్యమంత్రి వ్యక్తిగత నివాసం వద్ద ఈ దాడికి పాల్పడ్డారు. ఇది గమనించిన గార్డులు వెంటనే అక్కడకు చేరుకుని మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు.

 

- Advertisement -

Tatgs:Petro bomb attack on CM’s house ..!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page