ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు              

0 2,885

వైసిపి నాయకులు రామలింగేశ్వర రెడ్డి
పాములపాడు  ముచ్చట్లు:
నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని, విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, యూనిఫామ్ లను   అందజేశారు. పాములపాడు  మండల వైసీపీ నాయకులు రామలింగేశ్వర రెడ్డి
అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడం ద్వారా ప్రపంచంలో ఎవరితోనైనా పోటీపడే సామర్థ్యాలను ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి  రాష్ట్ర విద్యార్థుల్లో నెలకొల్పుతున్నారు అని అన్నారు. మంచి పౌరులుగా తీర్చిదిద్దుతూ అత్యుత్తమ మానవ వనరుల తయారీయే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నారు అని పేర్కొన్నారు వారి భవిష్యత్తుకు పటిష్ట పునాదులు వేస్తూ, విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారు అని అన్నారు .ఇందులో భాగంగా ‘మనబడి నాడు–నేడు’ ద్వారా తుమ్మలూరు పాఠశాలలకు 22 లక్షల వేయం తో ప్రభుత్వ స్కూళ్లను ఆధునీకరిస్తున్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అదేవిధంగా నందికొట్కూరు శాసన సభ్యులు తోగురు ఆర్థర్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో   పార్టీ నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి సర్పంచ్ ప్రసాద్  హెచ్ఎం, లు శ్రీనివాసులు ,సుంకన్న, తదితరులు పాల్గొన్నారు.

 

 

Tags:Public schools as opposed to private schools

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page