అక్కడక్కడ తేలికపాటి….భారీ వర్ష సూచన

0 15

అమరావతి  ముచ్చట్లు :
ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇప్పుడు దక్షిణ ఒడిశా తీరం వరకు విస్తరించింది. సముద్రమట్టానికి 3.1 కిమీ & 7.6 కిమీ మధ్య నైరుతి దిశగా వంగి ఉంది. ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఒకటి లేక రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. రేపు, ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. పెనుగాలులు ఉత్తర కోస్తా తీరం వెంబడి వీచే అవకాశం ఉంటుంది. ఎల్లుండి ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. పెనుగాలులు 40 కిమీ నుంచి 50 కిమీ వరకు గరిష్టంగా 60 కిమీ వరకు ఉత్తర కోస్తా తీరం వెంబడి వీచే అవకాశం ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

 

Tags:Scattered light… .Heavy rain forecast

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page