టీచర్ అవతారమెత్తిన జగన్

0 9,682

రాజమండ్రి  ముచ్చట్లు:

ధ్రప్రదేశ్‌ ప్రభుత్వ స్కూళ్లలో పండుగ జరుగుతోంది. ఒకవైపు బడి రూపు రేఖలు మారిపోయాయి. మరోవైపు విద్యా కానుక పంపిణీతో సందడి నెలకొంది. ఇవాళ్టి నుంచే స్కూళ్ల ప్రారంభంతో పిల్లలంతా ఉత్సాహంగా క్లాస్‌ రూమ్‌ల్లో కూర్చున్నారు.తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం పోతవరం జడ్పీ హైస్కూల్‌లో మరింత సందడి కనిపిస్తోంది. సీఎం జగన్‌ రాకతో కోలాహలంగా మారిపోయింది. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించి.. అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం తరగతి గదిలోని గ్రీన్‌ బోర్డుపై ‘ఆల్‌ ద వెరీ బెస్ట్‌’ అని రాసిన సీఎం జగన్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి తరగతి గదిలోకి వెళ్లి సీఎం జగన్‌ విద్యార్థులతో మాట్లాడుతూ పాఠ్య పుస్తకాలను పరిశీలించారు. పాఠశాల సిబ్బంది విద్యార్థులకు అందిస్తున్న పలు సౌకర్యాలను సీఎం జగన్‌కు వివరించారు.ముఖ్యమంత్రి జగన్‌ టీచర్‌గా మారిపోయారు. క్లాస్‌ రూమ్‌లోకి వెళ్లి పిల్లలతో మాట్లాడారు. గ్రీన్‌ బోర్డుపై చాక్‌పీస్‌తో ఆల్‌ ది వెరీ బెస్ట్‌ అని రాశారు సీఎం జగన్‌. బెంచ్‌పై కూర్చుని ప్రస్తుతం స్కూల్లో ఉన్న సౌకర్యాలు ఎలా ఉన్నాయో స్వయంగా విద్యార్థులను అడిగి తెలసుకొని.. ప్రభుత్వం అందిస్తున్న స్కూల్‌ బ్యాగ్‌ను భుజనా వేసుకొని మరీ సీఎం జగన్‌ పరిశీలించారు. విద్యార్థులకు అందించే ఆహారానికి సంబంధించిన ‘మెనూ’ను సీఎం జగన్‌ పరిశీలిచారు. మంచినీళ్ల వసతి నుంచి కిచెన్‌ వరకు జడ్పీ స్కూల్‌లో ప్రతి విభాగాన్ని పరిశీలించారు ముఖ్యమంత్రి. స్పీచ్‌ తెరపీ క్లాస్‌లను సీఎం పరిశీలించారు. స్కూళ్ల ప్రారంభం అవడంతో పిల్లలకు విద్యా కానుకను అందించారు. దాని కింద ఇచ్చే బ్యాగ్‌లు, స్కూల్‌ డ్రెస్‌, పుస్తకాలను, బూట్లను పరిశీలించారు ముఖ్యమంత్రి. బ్యాగ్‌ భుజానికి వేసుకుని క్వాలిటీని పరిశీలించారు. అనంతరం ‘మనబడి నాడు నేడు’ ద్వారా తొలి విడత పనులు పూర్తైన పాఠశాలలను పైలన్‌ ఆవిష్కరించి సీఎం జగన్‌ ప్రారంభించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ‘మనబడి నాడు నేడు’ ద్వారా తొలి విడత కింద రూ.3,669 కోట్లతో సర్వాంగ సుందరంగా 15,715 ప్రభుత్వ స్కూళ్లను ఆధునీకరించింది. నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్న సందర్భంగా వైఎస్‌ జగన్‌ వాటిని విద్యార్థులకు అంకితం చేశారు. అనంతరం రెండో విడత చేపట్టబోయే పాఠశాలల పనులకు సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ‘జగనన్న విద్యా కానుక’ రెండో విడత పంపిణీని రూ.731.30 కోట్లతో సీఎం జగన్‌ ప్రారంభించారు.

 

 

- Advertisement -

Tags:Teacher incarnate pics

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page