ప్రతి బీసీ కుటుంబానికి పది లక్షలు ఇవ్వాలి

0 3,617

హైదరాబాద్ ముచ్చట్లు:
ప్రతి బీసీ కుటుంబానికి 10 లక్షలరుపాయలు ఇచ్చేవిదంగా బీసీ బందు ప్రవేశ పెట్టాలని,చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని,తొలిగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగాలలోకి తీసుకోవాలని బిసి సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ కాచిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ కృష్ణ, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు నీలా వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలు కులవృత్తులు కోల్పోయి వీధిన పడ్డారని ఆరోపించారు.ప్రజల ఆకాంక్ష మేరకు బీసీ బంధును ప్రవేశ పెట్టాలన్నారు.65లక్షల బీసీలలో 45 లక్షల ప్రజలు వృత్తులు కోల్పోయారన్నారు.ఒక వైపు నిరుద్యోగం పెరుగుతుంటే ఉన్న ఉద్యోగాలను తొలిగించారని అందుకు నిదర్శననే 7651మంది ఫీల్డ్ అసిస్టెంట్లు అన్నారు.10లక్షలు ఇస్తేనే ఓటేస్తామన్నారు.బీసీ సమస్యల పరిష్కారానికి ఈనెల 24 న రాష్ట్ర వ్యాపితంగా ధర్నాలు, ఆందోళనలు చేయనున్నామని హెచ్చరించారు.

 

Tags:Ten lakhs should be given to each BC family

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page