ఆఫ్గన్ లో ముదురుతున్న వివాదం

0 4,768

కాబూల్  ముచ్చట్లు:

చైనా తన కుటిల మనస్తత్వాన్ని మరోసారి బయటపెట్టింది.తన స్వార్థ ప్రయోజాల కోసం ఎలాంటి అడ్డమైన గడ్డి తినేందుకు వెనుకాడదని డ్రాగన్ దేశం చాటుకుంది.  ఆఫ్గనిస్తాన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న  తాలిబన్లతో స్నేహ సంబంధాలకు తాము సిద్ధమని ప్రకటించింది. ఆఫ్ఘన్ పునర్నిర్మాణంలో మీకు సహకరిస్తామంటూ హామీ ఇచ్చింది. ఆఫ్ఘన్ అభివృద్ధిలో ఆఫ్గన్ తమ భాగస్వామ్యాన్ని అంగీకరిస్తోందని, ఇది స్వాగతించదగినదిగా చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ మహిళా అధికార ప్రతినిధి హువా చున్ ఇంగ్ పేర్కొన్నారు. కొన్ని తరాలుగా పెద్ద దేశాల ‘పిడికిలి’ లో చిక్కుకున్న ఆఫ్ఘానిస్తాన్ తో సంబంధాలను పెంచుకోవడం తమకు కూడా అంగీకారయోగ్యమేనని ఆమె పేర్కొన్నారు. సజావుగా అధికార మార్పిడి జరిగేలా. అరమరికలు లేని ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న మీ హామీని నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నామన్నారుఆఫ్ఘన్లు, విదేశీయుల భద్రతకు ముప్పు రాకుండా చూడాలని తాలిబన్లను చైనా కోరింది. గత నెలలో తాలిబన్ అధికార ప్రతినిధి బృందమొకటి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ ని తియాంజిన్ లో కలిసి ..మిలిటెంట్లకు స్థావరంగా ఆఫ్ఘన్ గడ్డను వినియోగించుకోవడాన్ని అనుమతించబోమని స్పష్టం చేసిన విషయం గమనార్హం. ఇందుకు బదులుగా ఆఫ్ఘన్ పునర్నిర్మాణానికి పెట్టుబడుల రూపంలో తాము సహకరిస్తామని ఆయన వారికి హామీ ఇచ్చారు. కాబూల్ లోని అన్ని దేశాల రాయబార కార్యాలయాలు మూత పడినప్పటికీ చైనా ఎంబసీ మాత్రం పని చేస్తోంది. కొన్ని నెలల క్రితమే చైనా తమ దేశస్థులను ఇక్కడి నుంచి తరలించింది. అయితే కాబూల్ లోని పరిస్థితిని గమనిస్తుండాలని, ఇళ్లలోనే ఉండాలని ఈ ఎంబసీ ఇంకా మిగిలి ఉన్న చైనీయులను కోరింది.ఇలా ఉండగా తాలిబన్ల ప్రభుత్వాన్ని తాము గుర్తించబోమని బ్రిటన్ పేర్కొంది. ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ఈ మేరకు ప్రకటన చేశారు,
వదిలి వెళ్లిపయే ప్రయత్నం
అఫ్ఘనిస్తాన్ తాలిబన్ల కబంద హస్తాల్లో చిక్కుకుంది. 20 ఏళ్లుగా జరుగుతున్న పోరాటాన్ని తాలిబన్లు పది రోజుల్లోనే ముగించేశారు. అఫ్ఘానిస్తాన్‌లోని కీలక పట్టణాలన్నింటినీ క్రమంగా ఆక్రమించుకుంటూ వచ్చి రాజధాని కాబూల్‌ను సైతం స్వాధీనం చేసుకున్నారు. ఈ నగరం నుంచి బయటకు వెళ్లే దారులన్నీ ఉగ్రవాదుల ఆధీనంలోకి వెళ్లిపోయాయి. కాబూల్ విమానాశ్రమం ఒక్కటి మాత్రమే అమెరికా సైన్యం ఆధీనంలో ఉంది.
కాబూల్‌ ఎయిర్‌పోర్టుకు ప్రజల పరుగులుదీంతో అక్కడి నుంచి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇతర విదేశాలకు పారిపోయేందుకు అఫ్ఘానిస్తాన్ ప్రజలు సిద్ధమయ్యారు. విమానాశ్రయానికి పరుగు పరుగున వచ్చిన వేలాది మంది ప్రజలు అక్కడ ఉన్న ఒకేఒక్క విమానాన్ని ఎక్కేందుకు ప్రయత్నించారు. విమానంలోకి వెళ్లేందుకు వేసిన ఒక మెట్ల నిచ్చెనపై చీమలదండులా వేలాడుతూ కనిపించారు. కాస్త సందు కనపడితే చాలు విమానంలోకి దూరేందుకు ప్రయత్నించారు.ఈ నేపథ్యంలోనే గతంలో ఏ దేశంలోనూ చూడని దృశ్యాలు కనిపించాయి. సునామీ, భూకంపాలు వచ్చినప్పుడు తరహాలో ప్రజలు పరుగులు తీస్తుండటాన్ని కొందరు వీడియోలు తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియోలు ఇప్పుడు ప్రపంచదేశాలను షాక్‌కు గురిచేస్తున్నాయి. అఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితి ఇంత దారుణంగా ఉందా? అంటూ ఇతర దేశాల వారు ముక్కున వేలేసుకుంటున్నారు. గుంపులుగా ఎగబడుతున్న ప్రజలను అదుపు చేయడం కోసం విమానాశ్రయానికి కాపలాగా నిలబడిన అమెరికా దళాలు అనేకసార్లు గాల్లో కాల్పులు జరిపిన శబ్ధాలు వీడియోలో వినిపిస్తున్నాయి,

 

 

- Advertisement -

Tags:The escalating conflict in Afghanistan

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page