రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి..మరొకరికి గాయాలు..

0 3,010

శ్రీకాకుళం ముచ్చట్లు :

 

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొత్తపల్లి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో యలమల కిరణ్‌(35), మద్ది జాస్మిని(8) అనే ఇద్దరు ఇద్దరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కవిటి మండలం భైరిపురం గ్రామానికి చెందిన యలమల కిరణ్‌ (35), ఇచ్ఛాపురం మండలం బెల్లుపడ గ్రామానికి చెందిన మద్ది విష్ణుప్రియ, ఆమె కుమార్తె జాస్మిని పలాస నుంచి ఇచ్ఛాపురం వైపు స్కూటీపై వెళ్తున్నారు. కొత్తపల్లి జాతీయ రహదారి మీదుగా వీరు వెళ్తుండగా.. సింహాచలం నుంచి ఒడిశాలోని అస్కా రోడ్డు వైపు వెళ్తున్న ఓడీ02బిఎన్‌ 8282 అనే నంబరు గల కారు ఈ స్కూటీని బలంగా ఢీకొంది. స్కూటీపై ప్రయాణిస్తున్న ముగ్గురు రోడ్డుపై ఎగిరి పడ్డారు. వీరిలో కిరణ్‌కు తలపై బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే మరణించాడు. విష్ణుప్రియ, జాస్మినికి తీవ్ర గాయాలయ్యా యి. స్థానికులు క్షతగాత్రులను పలాస సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ చిన్నారి జాస్మిని మృతి చెందింది. విష్ణుప్రియ పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళంలోని రిమ్స్‌కు తరలించారు.

 

- Advertisement -

గుంటూరు బిటెక్‌ విద్యార్థి రమ్యశ్రీ కుటుంబానికి రూ.10లక్షలు ఇవ్వాలి-పుంగనూరు దళిత నేతల డిమాండు

Tags: Two killed, another injured in road accident

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page