మీరు పిల్లలను బడికి పంపండి;  చదివించే బాధ్యత మాది

0 3,265

రెండేళ్లుగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు

పోటీతత్వాన్ని ఎదుర్కొనేలా విద్యార్థుల్ని తీర్చిదిద్దుతాం
మనబడి నాడు–నేడుతో మారిన స్కూళ్ల రూపురేఖలు
నూతన విద్యావిధానంతో ఆరు రకాల స్కూల్స్‌
ప్రతి ఒక్కరూ పిల్లలను బాగా చదివించండి

- Advertisement -

అనంతపురంముచ్చట్లు:

 

‘‘తల్లిదండ్రులు మీ పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువు ఒక్కటే. మీరు బడికి పంపండి. చదివించే బాధ్యత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని మా ప్రభుత్వం తీసుకుంటుంది. రెండేళ్లుగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చాం. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యాబోధన సాగుతుంది. ఉపాధ్యాయులు కూడా పోటీతత్వాన్ని తట్టుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దాలి’’ అని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తెలిపారు. నగరంలోని శ్రీకృష్ణదేవరాయ నగర పాలక ఉన్నత పాఠశాలలో సోమవారం మనబడి నాడు–నేడు మొదటి విడత పనులను జాతికి అంకితం చేయడంతో పాటు విద్యార్థులకు విద్యాకానుక కింద కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ రెండేళ్ల క్రితం ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకున్నారన్నారు. ఎవరూ ఊహించని విధంగా, దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ స్కూళ్లను బాగు చేస్తున్నామన్నారు.  పిల్లలను చదివించడం అనేది తల్లిదండ్రులకు భారం కాకూడదని విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాలను తీసుకొచ్చినట్లు తెలిపారు. మనబడి నాడు–నేడు కార్యక్రమం కింద కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. మూడు విడతల్లో నాడు–నేడు పనులను చేపట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3670 కోట్లతో తొలి దశలో స్కూళ్లను ఆధునికీరించామన్నారు. తొలివిడతలో 15,715 స్కూళ్ల రూపురేఖలు మార్చివేశామన్నారు. ఇంగ్లిష్‌ మీడియం వల్ల తాత్కాలిక ఇబ్బందులు ఉండవచ్చని, అందుకు అనుగుణంగా విద్యాబోధన సాగించేందుకు ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. నూతన విద్యావిధానంతో పీపీ–1 నుంచి 12వ తరగతి వరకు  ఆరు రకాలు స్కూల్స్‌ తీసుకొస్తున్నామన్నారు. అంగన్‌వాడీ నుంచే ఇంగ్లిష్‌ మీడియం ప్రారంభం అవుతుందన్నారు. మూడో తరగతి నుంచి ప్రతి సబ్జెక్ట్‌కు టీచర్‌ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై ప్రతిపక్ష పార్టీల నేతలు చేస్తున్న విమర్శలను ఎవరూ పట్టించుకోవద్దని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను బాగా చదివించాలని కోరారు. కోవిడ్‌ నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని స్కూళ్లను తెరుస్తున్నామన్నారు. అనవసర భయాలు వీడాలని, పిల్లలు ఏ మాత్రం అనారోగ్యంగా ఉన్నా ఉపాధ్యాయులకు తెలియజేయాలన్నారు. నగర మేయర్‌ మహమ్మద్‌ వసీం మాట్లాడుతూ జగనన్న విద్యాకానుక విద్యార్థులకు వరం అన్నారు. స్కూల్‌ యూనిఫాం గతంలో ప్రైవేట్‌ స్కూళ్లకే పరిమితమని, కానీ నేడు ప్రభుత్వమే అందజేస్తోందన్నారు. నాడు–నేడు కింద స్కూళ్లలో సకల సౌకర్యాలు తీర్చిదిద్దుతున్నారని అన్నారు. చిన్నారుల భవిష్యత్‌ కోసం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని,  ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.  కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తి మాట్లాడుతూ.. 30 ఏళ్ల తన సర్వీస్‌లో స్కూళ్లలో ఇలాంటి ఫర్నీచర్‌ ఎప్పుడూ చూడలేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వల్లే ఇది సాధ్యమైందన్నారు.  నగరంలో 18 స్కూళ్లలో నాడు–నేడు పనులు చేసినట్లు తెలిపారు. కార్పొరేటర్‌ చవ్వా రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ పేదవాళ్లు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంతో విద్యను చేరువ చేశామన్నారు. గత ప్రభుత్వ హయాంలో విద్య వ్యాపారంగా మారిందన్నారు. విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించారని తెలిపారు. కానీ నేడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ విద్యకు అగ్రతాంబూలం అందిస్తున్నారన్నారు. రెండేళ్లలో విద్య, వైద్య రంగాల్లో గణనీయ మార్పులు వచ్చాయన్నారు. విద్య విలువ తెలిసిన వ్యక్తిగా గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తెచ్చారన్నారు. ప్రజల నాడి తెలిసిన ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ ముందుకెళ్తున్నారన్నారు. కార్పొరేటర్‌ సాకే చంద్రశేఖర్‌ మాట్లాడుతూ విద్యతోనే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందన్నారు. తమ ప్రభుత్వంలో పేదవాడికి చదువు భారం కాదని,  ఆ భారాన్ని మోయడానికి సీఎం జగన్‌ సిద్ధంగా ఉన్నారన్నారు.  ఇన్నాళ్లూ ప్రైవేట్‌ స్కూళ్లలో చదువు బాగుంటుందని పంపేవాళ్లని, కానీ రెండేళ్లుగా మార్పు మొదలైందన్నారు. అమ్మ ఒడి కింద ఏటా రూ.15 వేలు అందిస్తున్నామని తోలిపారు. నాడు–నేడుతో ప్రభుత్వ స్కూళ్లు అద్భుతంగా తీర్చిదిద్దుకున్నాయన్నారు. మంచి ఆలోచనతో సీఎం జగన్‌ ముందుకు వెళ్తుంటే చివరకు ఇంగ్లిష్‌ మీడియంను కూడా అడ్డుకునే ప్రయత్నాన్ని బూచి తాత (చంద్రబాబు) చేశారంటూ ఎద్దేవా చేశారు. అందరూ బాగా చదువుకోవాలని కోరారు. తల్లిదండ్రులు ఆస్తులు ఇవ్వకపోయినా చదువు అనే ఆస్తిని జగన్‌ ఇస్తున్నారు. పేదల ఆర్థిక స్థితిగతులను మార్చేది చదువు మాత్రమేనన్నారు. అనంతరం విద్యార్థులకు విద్యాకానుక కిట్లను పంపిణీ చేశారు.

పాత ఫర్నీచర్‌పై ఎమ్మెల్యే అసంతృప్తి
విద్యాకానుక కిట్ల పంపిణీ తర్వాత పాఠశాలలో నాడు–నేడు కింద చేపట్టిన పనులను ఎమ్మెల్యే అనంత పరిశీలించారు. తరగతి గదుల్లో ఫర్నీచర్‌ను పరిశీలించారు. పాఠశాల పైనున్న రెండు తరగతి గదుల్లో పాత ఫర్నీచర్‌ ఉండడంపై ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. స్కూల్‌ హెడ్‌మాస్టర్‌ శాంసన్, స్కూల్‌ సూపర్‌వైజర్‌ రమేశ్‌ బాబు పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు కొత్త ఫర్నీచర్‌ వేయలేదని ప్రశ్నించారు. స్కూల్‌లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని వారు చెప్పడంతో తక్షణం సమస్య పరిష్కరించాలని నగర పాలక సంస్థ సెక్రటరీ సంగం శ్రీనివాసులుకు సూచించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఫర్నీచర్‌ అందుబాటులోకి తేవాలన్నారు. ఎక్కడైనా సమస్య వస్తే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. త్వరలోనే నగరంలోని అన్ని స్కూళ్లను పరిశీలిస్తానని, ఎక్కడా ఇలాంటి సమస్య ఎదురవకుండా చూడాలన్నారు.

కొరటాల ఐసోలేషన్ సెంటర్ చేసిన కోవిడ్ సేవలను గుర్తించి వారికి ప్రశంశా పత్రాలను అందజేస్తున్న -భూమన కరుణాకర్ రెడ్డి,

Tags:You send children into slavery; The responsibility of reading is ours

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page