రుణమాఫీ ట్రయిల్ రన్ సక్సెస్

0 5,891

విజయవాడముచ్చట్లు:

రుణమాఫీ ట్రయల్ రన్ విజయవంతమైంది. రూ.25 వేల నుండి రూ.25,100 వరకు రుణాలున్న వారి ఖాతాలకు ట్రయల్ రన్ నిర్వహించారు. తొలిరోజు 1309 మంది రైతుల ఖాతాలకు రుణమాఫీ నిధుల బదిలీ చేశారు. ఈ నెల 30 వరకు ప్రక్రియ కొనసాగనుంది. రూ.50 వేల రూపాయల లోపు గల రైతుల రుణాలన్నీ మాఫీ చేయనుంది ప్రభుత్వం. రైతుబంధు నిధుల పంపిణీ మాదిరిగానే రుణమాఫీ నిధులు కూడా జమ అవుతాయి. 25వేలు, 26వేలు, 27వేలు స్లాబుల వారీగా రుణమాఫీ మొత్తం రైతుల ఖాతాల్లో జమ అవుతుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. రెండో విడుత రుణమాఫీలో 6,06,811 మంది రైతులకు లబ్ధి చేకూరనుందని ఆయన చెప్పారు.  నెలాఖరు వరకు 2005 కోట్లా 85 లక్షల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని చెప్పారు. సోమవారం నుంచి రుణమాఫీ మొదలయిన నేపథ్యంలో రైతు లోకానికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.  సీఎం కేసీఆర్ నేతృత్వంలో 2014 నుంచి 18 వరకు 16,144 కోట్ల రైతు రుణాలు మాఫీ అయ్యాయని అన్నారు. 2018లో 25 వేలలోపు రుణాలున్న 2.96 లక్షల మంది రైతులకు 408.38 కోట్ల మేర మాఫీ అయిందని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు రాష్ట్ర రైతుల పక్షాన థ్యాంక్స్ చెప్పిన నిరంజన్ రెడ్డి… సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయ రంగానికి కేసీఆర్ వెన్నుదన్నుగా నిలచారని అన్నారు. ఆకలితో అలమటించిన తెలంగాణను దేశానికే అన్నపూర్ణగా నిలిపారని మంత్రి పేర్కొన్నారు. పంటల మార్పిడి వైపు రైతులను ప్రోత్సహించి తెలంగాణ వ్యవసాయాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.రైతుల ఖాతాలలో జమయిన నిధులను బ్యాంకర్లు ఇతర పద్దుల కింద జమ చేసుకోవద్దని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రుణాలు మాఫీ అయిన రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు అందజేయాలని సూచించింది.

 

 

 

- Advertisement -

Tags:Debt waiver trail run success

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page