తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా

0 9,910

తిరుమలముచ్చట్లు:

లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు.ఆలయం వద్దకు చేరుకున్న స్పీకర్ కు టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి, అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.స్పీకర్ శ్రీ ఓం బిర్లా ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించి ఆ తరువాత మూలమూర్తి దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్, ఈఓ కలిసి శ్రీవారి తీర్థప్రసాదాలు, డైరీ, క్యాలెండర్, కాఫీ టేబుల్ బుక్ అందించారు.ఈ కార్యక్రమంలో ఎంపిలు శ్రీ విజయసాయిరెడ్డి, శ్రీ మిధున్ రెడ్డి, శ్రీ గురుమూర్తి, శ్రీ భరత్, కలెక్టర్ శ్రీ హరినారాయణన్, అదనపు ఎస్పీ శ్రీ మునిరామయ్య, ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ రమేష్ బాబు, రిసెప్షన్ డెప్యూటీ ఈఓ శ్రీ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

 

Tags:Lok Sabha Speaker Shri Om Birla visited Thirumala Srivastava

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page