తాలిబన్లతో రష్యా రాయబారి భేటీ..!

0 8,015

ఆప్ఘనిస్థాన్ ముచ్చట్లు :

 

ఆప్ఘనిస్థాన్ లో అత్యంత వేగంగా మారుతున్న పరిణామాలను రష్యా నిశితంగా పరిశీలిస్తోంది. ఈరోజు తాలిబన్ నేతలతో రష్యా రాయబారి ప్రత్యేకంగా భేటీ కానున్నారు. తాలిబన్లు ఏర్పాటు చేసే ప్రభుత్వానికి అండగా ఉంటామని ఈ సమావేశంలో ఆయన స్పష్టం చేసే అవకాశం ఉందని చెపుతున్నారు. వాస్తవానికి గతంలో కూడా ఆఫ్ఘన్లకు రష్యా సహకారం అందించింది. 1979 ప్రాంతంలో ఆఫ్ఘన్ కు రష్యా అండగా ఉంది. ఆ ప్రాంతాన్ని అప్పటి సోవియట్ యూనియన్ స్వాధీనంలోకి తీసుకుంది. సోవియట్ యూనియన్ పతనం కావడంతో రష్యన్ బలగాలు వెనక్కి మళ్లాయి. ఇప్పుడు మరోసారి ఆఫ్ఘన్ కు సహకారం అందించేందుకు రష్యా ముందుకు వస్తున్నట్టు సమాచారం. మరోవైపు తాలిబన్లకు సహకరిస్తామని ఇప్పటికే చైనా ప్రకటించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

గుంటూరు బిటెక్‌ విద్యార్థి రమ్యశ్రీ కుటుంబానికి రూ.10లక్షలు ఇవ్వాలి-పుంగనూరు దళిత నేతల డిమాండు

Tags: Russian ambassador meets Taliban

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page