ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠాన్ని సందర్శించిన లోక్‌స‌భ స్పీకర్

0 4,595

తిరుమల ముచ్చట్లు :

లోక్‌స‌భ స్పీకర్ శ్రీ ఓం బిర్లా మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠాన్ని సంద‌ర్శించారు.వేద విజ్ఞాన పీఠానికి చేరుకున్న స్పీకర్ కు ఇక్క‌డి వేద‌పండితులు సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా ప్రార్థ‌నా మందిరంలో గ‌ల శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి అర్చ‌కులు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. స్పీక‌ర్ దంప‌తుల‌కు వేద‌పండితులు వేదాశీర్వ‌చ‌నం చేశారు. టిటిడి ఛైర్మ‌న్‌ శ్రీ వైవి.సుబ్బారెడ్డి దంప‌తులు శాలువ‌, శ్రీ‌వారి చిత్రప‌టం, తీర్థ‌ప్ర‌సాదాల‌తో స్పీక‌ర్ దంప‌తుల‌ను స‌న్మానించారు.ఈ కార్యక్రమాల్లో ఎంపిలు శ్రీ విజయసాయిరెడ్డి, శ్రీ మిధున్ రెడ్డి, శ్రీ గురుమూర్తి, శ్రీ భరత్, అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Tags:Speaker of the Lok Sabha visits the Dharmagiri Vedic Academy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page