కర్నూలులో వలంటీర్‌ ఆత్మహత్య

0 8,608

కోడుమూరు ముచ్చట్లు :

కర్నూలు జిల్లా కోడుమూరు సుందరయ్య కాలనీలో నివాసం ఉంటున్న అల్లుగుండు అబ్దుల్‌ ఖాదర్‌, జైనాబీ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు హబీబ్‌బాషా (26) వార్డు వలంటీర్‌. ఇద్దరు కొడుకులకూ పెళ్లి చేయాలని ఖాదర్‌ నెల కిందట ఖాయం చేశారు. అప్పటి నుంచి హబీబ్‌ దిగాలుగా ఉంటున్నాడు. పెళ్లయితే ప్రభుత్వం ఇచ్చే రూ.5వేల వేతనంతో కుటుంబాన్ని పోషించుకోవడం కష్టమని, మరో ఉద్యోగం వస్తుందో.. లేదో అని తండ్రితో చెబుతూ బాధపడుతుండే వాడు. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో హబీబ్‌ చీరతో ఉరివేసుకున్నాడు. 3 గంటలకు ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులకు కొడుకు శవమై కనిపించడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు.

 

- Advertisement -

Tags:Volunteer commits suicide in Kurnool

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page