న‌డ‌క‌తో గుండెకు మేలు..!

0 5,903

ఢిల్లీ ముచ్చట్లు :

న‌డ‌క మ‌నిషి శ‌రీరానికి మంచి వ్యాయామం. న‌డ‌క వ‌ల్ల ఆరోగ్యపరంగా ఎన్నో ప్ర‌యోజ‌నాలు చేకూరుతాయి. ఇప్ప‌టికే ప‌రిశోధ‌న‌ల్లో ఈ విష‌యం నిరూపిత‌మైంది. ఈ క్రమంలో గుండె ఆరోగ్యంపై న‌డ‌క వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌పై తాజాగా ప‌రిశోధ‌కులు చేసిన అధ్య‌య‌న ఫ‌లితాల‌ను మెడికల్‌ జర్నల్‌ ‘న్యూరాలజీ’ ప్రచురించింది. గుండెపోటుకు గురైన వాళ్లు వారం మొత్తంలో 3-4 గంటల పాటు నడవగలిగితే 54 శాతం వ‌ర‌కు మ‌ర‌ణాల రిస్క్ త‌గ్గుతుంద‌ని చెప్పారు. ఇవే ప్ర‌యోజ‌నాలు వారంలో 3-4 గంట‌ల పాటు సైకిల్‌ తొక్కడం లేదా వ్యాయామాలు చేయ‌డం వ‌ల్ల కూడా చేకూరుతాయ‌ని తెలిపారు. గుండెపోటుకు గురైన వారు రోజుకు 30 నిమిషాల నడక లేక‌ సైక్లింగ్ చేయ‌డం అల‌వాటుగా మార్చుకోవాల‌ని ప‌రిశోధ‌కులు సూచించారు.

 

- Advertisement -

Tags:Walking is good for the heart ..!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page