దాసరి అరుణ్‌పై అట్రాసిటీ కేసు

0 15

హైదరాబాద్ ముచ్చట్లు :

ప్రముఖ దర్శకుడు దివంగత దాసరి నారాయణరావు చిన్న కుమారుడు దాసరి అరుణ్‌కుమార్‌పై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఐపీసీ 504, 506, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. బొల్లారానికి చెందిన బ్యాగరి నర్సింహులు వెంకటేష్‌ అనే టెక్నీషియన్‌ అరుణ్ కుమార్ వద్ద పనిచేస్తున్నాడు. ఇటీవల డబ్బులు ఇవ్వాల్సి వచిన్నప్పుడు అరుణ్‌కుమార్‌ కులం పేరుతో తనను దూషించారని, నీ అంతు చూస్తానంటూ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను కులం పేరుతో దూషించడంతో పాటు ఆయన నుంచి తనకు ప్రాణహాని ఉందని ఈ నెల 16న బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరుణ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Tags:Atrocity case against Dasari Arun

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page